• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లా విద్యార్థిని కోర్టుకు... చిన్మయానంద ఆసుపత్రికి....!

|

ఉత్తరప్రదేశ్ షాజహన్ పూర్ లా విద్యార్థిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కోంటున్న మాజీ కేంద్రమంత్రి చిన్మయానందా అసుపత్రి పాలయ్యాడు. సోమవారం రాత్రీ అనారోగ్యానికి గురి కావడంతో పాటు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనపై ఆరోపణల నేపథ్యంలో లా విద్యార్థిని స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు సోమవారం కోర్టుకు హజరైంది. దీంతో చిన్మాయంద అనారోగ్యం పాలయ్యాడు.

 అరెస్ట్ అంటే ఆసుపత్రిపాలే...

అరెస్ట్ అంటే ఆసుపత్రిపాలే...

బడా బడా నాయకులపై ఏవైన కేసులు నమోదై, అరెస్ట్‌ వారంట్ విడుదల అయిందంటే చాలు...అనారోగ్యం పాలు కావడం, ఆసుపత్రికి వెళ్లడం..ట్రెండ్‌‌గా మారింది. దీంతో వారు ముందస్తుగా అరెస్ట్ కాకుండా వ్యుహాలు పన్నుతారు. ఇందుకోసం అనారోగ్యం అనే వజ్రాయుధాన్ని ఉపయోగిస్తారు. చికిత్స పేరుతో ఆసుపత్రిలో ఉండి రాజకీయాలు చేస్తారు. అనంతరం కేసుల నుండి బయటపడతారు. అయితే ఇలాంటే కేసుల్లో దర్యాప్తు సంస్థలు చాల సిరియస్‌గా ఉంటే తప్ప నిందితులను తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం మాత్రం ఉండదు. తాజాగా బీజేపీ కేంద్ర మాజీ మంత్రి,యూపీ సినియర్ నాయకుడైన స్వామి చిన్మాయనంద ఇదే పరిస్తితిని ఎదుర్కోంటున్నాడు.

కోర్టుకు హైజరైన లా విద్యార్థిని

కోర్టుకు హైజరైన లా విద్యార్థిని

కేసు విచారణ నిమిత్తం లా విద్యార్థిని సోమవారం కోర్టుకు తరలించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆమేపై దాడులు చేసే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టుకు వచ్చింది. కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ఇతరులకు కనబడకుండా ముఖానికి ముసుగేసుకుని పోలీసులు తీసుకువచ్చారు. సుమారు ఐదు గంటలపాటు మేజిస్ట్రేట్ ముందు తనకు జరిగిన అన్యాయాన్ని ఈ సంధర్భంగా కోర్టుకు వివరించింది.

 12పేజీల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన సిట్

12పేజీల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన సిట్

కేసును విచారించేందుకు సుప్రిం కోర్టు సిట్‌ను ఏర్పాటు చేయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం కొద్ది రోజుల క్రితమే విచారణ ప్రారంభించింది. సిట్ పోలీసుల విచారణలో లా విద్యార్ధి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. చిన్మయంద తనను ఎప్పుడు కలిసింది,ఆయన ఏ విధంగా వేధింపులకు పాల్పడింది వివరించింది. మొత్తం 12 పేజీల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసినట్టు సమాచారం. విచారణలో భాగంగానే చిన్మయనందా తనకు ఆశ్రయమించి నమ్మించాడని తనకు సంబంధించిన హస్టల్లో ఉంటున్న ఆశ్రయమిచ్చి స్నానం చేస్తుండగా వీడీయోలు తీయించాడని చెప్పింది. వీడీయో చూపించి తనను బ్లాక్‌మెయిల్‌ చేశాడని వివరించింది. సంవత్సరకాలంగా పలుసార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపినట్టు సమచారం.

చిన్మయానందకు నోటీసులు,

చిన్మయానందకు నోటీసులు,

విద్యార్ధిని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన సిట్ బృందం స్వామి చిన్మయానందను విచారించేందుకు సిట్ ముందు హజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అంతకు ముందే ఆయన హస్ట‌ల్ ‌ అత్యాచారానికి గురైన గదిని పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు మరోవైపు అత్యాచారానికి సంబంధించిన వీడీయోలు మాయామయ్యాయనే ఆరోపణలు కూడ వచ్చాయి.దీంతో ఆయన విచారించేందుకు అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చిన్మాయనంద ఆసుపత్రి పాలయ్యాడు.

English summary
Chinmayanand, the BJP leader and former union minister accused of rape and blackmail by a law student was hospitalised on Monday night after he complained of "uneasiness and weakness".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X