వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్నికయ్యారు. మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సామవేశంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు ఫడ్నవిస్‌ను తమ నేతగా ఎన్నుకొన్నారు. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

బిజెపి ప్రతినిధుల బృందం గవర్నర్‌ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనుంది. ఏక్‌నాథ్ ఖడ్సే శాసనసభాపక్ష నేతగా ఫడ్నవిస్ పేరును ప్రతిపాదించగా ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో 19వ ఏటనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన దేవేంద్ర ఫడ్నివిస్ 44 సంవత్సరాలకే మహారాష్ట్ర సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మంగళవారం జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి నేత నడ్డాలు హాజరయ్యారు. సంఘ్ పరివార్‌తో అనుబంధమున్న దేవేంద్ర ఫడ్నవిస్ బిజెపిలో కీలక పాత్ర పోషించారు. న్యాయశాస్త్రంలో పట్టాపొందిన ఫడ్నవిస్ తండ్రి ద్వారా రాజకీయాల్లో ప్రవేశించి 1992 నుంచి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.

ఫడ్నవిస్ రాజకీయాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మార్గనిర్దేశకుడు. నాగపూర్ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 21ఏళ్లకే మున్సిపల్ కార్పొరేటర్‌గా విధులు నిర్వహించారు. 27వ ఏట నాగపూర్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1989లో నాగపూర్ బిజెపి విద్యార్థి విభాగంలో ఫడ్నవిస్ కీలక పాత్ర పోషించారు.

దేవేంద్ర ఫడ్నవిస్

దేవేంద్ర ఫడ్నవిస్

మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్నికయ్యారు.

దేవేంద్ర ఫడ్నివిస్

దేవేంద్ర ఫడ్నివిస్

మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సామవేశంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు ఫడ్నవిస్‌ను తమ నేతగా ఎన్నుకొన్నారు. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

దేవేంద్ర ఫడ్నవిస్

దేవేంద్ర ఫడ్నవిస్

బిజెపి ప్రతినిధుల బృందం గవర్నర్‌ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనుంది. ఏక్‌నాథ్ ఖడ్సే శాసనసభాపక్ష నేతగా ఫడ్నవిస్ పేరును ప్రతిపాదించగా ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

దేవేంద్ర ఫడ్నవిస్

దేవేంద్ర ఫడ్నవిస్

దీంతో 19వ ఏటనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన దేవేంద్ర ఫడ్నివిస్ 44 సంవత్సరాలకే మహారాష్ట్ర సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

1999లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నాగపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. చిన్న వయసులోనే మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఫడ్నవిస్.

ఇది ఇలా ఉండగా మహారాష్ట్రలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బిజెపికి, శివసేన మద్దతు ఇస్తామని ప్రకటించింది. బిజెపి 123 స్థానాలను, శివసేన 63 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రజల సంక్షేమం కోసమే బిజెపితో కలిసి పని చేస్తున్నామని శివసేన పేర్కొంది.

సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తా: ఫడ్నవిస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో సుస్థిరత, సుపరిపాలన తీసుకు వచ్చారని, మహారాష్ట్రలోను తాను సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తానని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. పార్టీ తన పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు. పార్టీ నాయకత్వం, సహచరుల అభిప్రాయాలతో ముందుకు పోతానన్నారు. తనను నాయకుడిగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలకు, పార్టీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

English summary
The Maharashtra BJP president Devendra Gangadharrao Fadnavis has been named the new chief minister of the state on Tuesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X