వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయ రైల్వేలో ఇంకా అచ్చే దిన్ రాలేదు: బీజేపీ సీనియర్ నేత లక్ష్మీకాంత చావ్లా

|
Google Oneindia TeluguNews

భారతీయ రైల్వేలో అచ్చేదిన్ ఇంకా రాలేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు... బీజేపీ సీనియర్ మహిళా నేత లక్ష్మీకాంత చావ్లా. ఇక వివరాల్లోకెళితే... లక్ష్మీకాంత చావ్లా ఓ రైల్వే స్టేషన్‌లో తాను ఎక్కాల్సిన రైలు కోసం వేచి ఉన్నారు. ఇలా నిమిషాల పాటు కాదు.. గంటలపాటు. ఆమె ఎక్కాల్సిన రైలు వచ్చింది. చేరాల్సిన గమ్యస్థానం 9 గంటల పాటు ఆలస్యం అయ్యింది. ఆమె సహనం కోల్పోయారు. "ప్రధానిగారు బుల్లెట్ రైలు సంగతి తరువాత ముందుగా సాధారణ రైళ్లపై దృష్టి సారించండి " అంటూ తాను పోస్టు చేసిన వీడియోలో చెప్పారు.

BJP leader has harrowing experience in train, says no “acche din” in railways

లక్ష్మీ కాంత చావ్లా అమృత్‌సర్ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో వేచి చూశారు. రైలు వచ్చింది. ఆమె ఎక్కారు. కానీ చేరాల్సిన గమ్యస్థానం సాధారణ సమయంకంటే 9 గంటలు ఆలస్యంగా చేరుకుంది. అంతేకాదు రైలులో ఆకలి వేయగా... తినేందుకు ఆహార పదార్థాలు కూడా లేవని ఆమె మండిపడ్డారు.

శతాబ్ది లాంటి సూపర్ ఫాస్ట్ ట్రైన్‌లు అభివృద్ధి చెందాయి కానీ సామాన్యుడు ప్రయాణం చేసే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మాత్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదని చెప్పారు. అంతేకాదు తాను ప్రయాణించిన సరయు-యమున ఎక్స్‌ప్రెస్ 9 గంటలపాటు ఆలస్యం అయ్యిందని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆమె ప్రధాని స్థాయి నుంచి రైల్వే మంత్రివరకు ప్రతి ఒక్కరిని విమర్శించారు.

"వాతావరణం చల్లగా ఉంది.. అసలే చలికాలం. చాలామంది రైలు కోసం వేచి చూస్తూ రైల్వే ప్లాట్ ఫాంపైనే కూర్చుని ఉన్నారు. టీవీ స్క్రీన్‌లపై వస్తున్న రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశాము. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు." అని చావ్లా వీడియోలో రికార్డు చేసి ట్వీట్ చేశారు.

English summary
A train in which senior BJP leader Laxmi Kanta Chawla was travelling got delayed by around 9 hours and this prompted the veteran leader from Punjab to post a video in which she can can heard telling the Prime Minister and the Railway Minister to "forget about bullet trains and focus on the ones that are already running."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X