వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హనుమాన్ శోభాయాత్రలో పాల్గోన్న ఇష్రత్ జహాన్... ఇంటిని చుట్టుముట్టిన ముస్లిం మైనారీటీలు...!

|
Google Oneindia TeluguNews

త్రిబుల్ తలాక్ పిటిషన్ వేసిన ముస్లిం మహిళ,బీజేపీ నాయకురాలైన ఇష్రత్ జహాన్‌‌కు మరోసారి తన వర్గం నుండి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. తాజాగా హిందువులు నిర్వహించే హానుమాన్ శోభాయాత్రలో పాల్గోనడంతోపాటు, హనుమాన్ చాలీసా పఠించింది. దీంతో వందాలాదీ మంది మైనారీటీలు ఆమే ఇంటిని చుట్టిముట్టారు. ఈనేపథ్యంలోనే ఇంటిని ఖాలీ చేయించే విధంగా ఒత్తిడి తెచ్చారని ఆమే పోలీసులకు పిర్యాధు చేశారు.

కోల్‌కాతాలో మరో వివాదం.. హనుమాన్ యాత్రలో పాల్గోన్న ఇష్రత్ జహాన్

కోల్‌కాతాలో మరో వివాదం.. హనుమాన్ యాత్రలో పాల్గోన్న ఇష్రత్ జహాన్

కోల్‌కతాలో హిందు,ముస్లింల మధ్య వివాదం చెలరేగింది.ఇప్పటికే జై శ్రీరాం నినాదాలతో కోల్‌కతా నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ ఇటు స్థానిక తృణముల్ కార్యకర్తలకు మధ్య వివాదాలు నెలకోన్న నేపథ్యంలోనే తాజాగా మరోవివాదం రాజుకుంది. బీజేపీ నాయకురాలు, త్రిబుల్ తలాక్ పిటిషనర్ అయిన ఇష్రత్ జహాన్‌ ఇటివల బిజేపీ కార్యకర్తలు నిర్వహించిన హనుమాన్ శోభ యాత్రలో ఇష్రత్ జహాన్ పాల్గోంది. శోభాయాత్రంలో భాగంగా హనుమాన్ చాలీసా పుస్తకాలను కూడ పంపీణి చేయడం పలువురు స్థానికులు గమనించారు.

ఇష్రాత్ జహాన్ ఇంటిని చుట్టుముట్టిన ముస్లింలు

ఇష్రాత్ జహాన్ ఇంటిని చుట్టుముట్టిన ముస్లింలు

దీంతో హౌరాలో నివసిస్తున్న ఇష్రత్ జహాన్ ఇంటికి పలువురు ముస్లిం మైనారీటీలు ఆమే ఇంటికి చేరుకుని ముస్లిం మతానికి వ్యతిరేకంగా ఎందుకు వ్వవహరిస్తున్నావంటూ ప్రశ్నించారు.బురఖాతో హిందు ర్యాలీలో ఎందుకు పాల్గోన్నావని అడిగారు.. దీంతో పాటు ఇంటి యజమాని కూడ ఇళ్లు కాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. కాగా ర్యాలీ జరుగుతున్న సమయంలో కూడ కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారని అయితే ఇరువర్గాలను పోలీసులు చెదరగోట్టారని ఆమే చెప్పారు. అయితే పోలీసులు కూడ పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని ఆమే మండిపడ్డారు.

గతంలో ఓ సారి పాల్గోన్నందుకు భర్త నుండి విడాకులు

గతంలో ఓ సారి పాల్గోన్నందుకు భర్త నుండి విడాకులు

ఈనేపథ్యంలోనే తనపై దాడి చేసే అవకాశం ఉందని , కోంతమంది చంపుతామని బెదిరిస్తున్నారని ఆమే చెప్పారు.ఏ క్షణంలోనైనా తనపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని, ఇక తన కుమారుడితో కలసి ఉంటున్న నేపథ్యంలోనే తనకు రక్షణ కల్పించాలని ఆమే పోలీసులకు కోరారు. కాగా ఇష్రత్ జహాన్ 2014లో హౌరాలో భారతీయ యువమోర్చ నిర్వహించిన హానుమాన్ యాత్రలో పాల్గోనడంతో ఆమే భర్త దుబాయ్ నుండే ఫోన్‌లో త్రిబుల్ తలాక్‌తో విడాకులు తీసుకున్నాడు.

English summary
BJP leader Ishrat Jahan and her children were driven out of their home by their landlord in Howrah for attending a Hindu religious ceremony and reciting Hanuman Chalisa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X