వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ్యాజిక్కు చేస్తే ఓట్లు రాలతాయా.. మరి ఆ బీజేపీ నేత..!

|
Google Oneindia TeluguNews

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓట్ల కోసం నేతలు చేస్తున్న ఫీట్లు నవ్వు తెప్పిస్తున్నాయి. మరోవైపు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆయా పార్టీల నేతల జిమ్మిక్కులు చర్చానీయాంశంగా మారాయి. ఓ బీజేపీ నేత మరో అడుగు ముందుకు వేసి ఔరా అనిపించేలా చేసిన ఘట్టం వీడియో రూపంలో బయటకు వచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఫన్నీగా మారింది.

ఈ నెల 21వ తేదీన రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆ నేపథ్యంలో ప్రచారం హీటెక్కిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ప్రచారానికి ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అస్త్రశస్త్రాలు బయటకు తీస్తున్నారు. ఆ క్రమంలో అజయ్ దివాకర్ అనే బీజేపీ లీడర్ చేసిన నిర్వాకం వైరలయింది.

ఎన్నికల ప్రచారమంటే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కామన్. ఇక లీడర్లంతా బస్తీలు, గల్లీలు తిరుగుతూ గడ్డం తీయడం, పంక్చర్లు వేయడం, బజ్జీలు కాల్చడం తదితర ఫన్నీ సన్నివేశాల్లో మునిగిపోతుంటారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. అదే నేపథ్యంలో అజయ్ దివాకర్ చేసిన ఫీటు చర్చానీయాంశంగా మారింది.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్.. బస్ భవన్ దగ్గర లాయర్లు అరెస్ట్.. నాంపల్లి కోర్టు దగ్గర టెన్షన్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్.. బస్ భవన్ దగ్గర లాయర్లు అరెస్ట్.. నాంపల్లి కోర్టు దగ్గర టెన్షన్

BJP leader magic show at rally in UP Rampur by elections

రాంపూర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక సందర్భంగా అజయ్ దివాకర్ ప్రచారం నిర్వహించారు. ఆ క్రమంలో సభలో మ్యాజిక్ చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీల నేతలను ఏకిపారేసిన సదరు లీడర్.. అన్నీ పార్టీల జెండాలు చేతిలో పట్టుకుని మ్యాజిక్ చేశారు. ఆ క్రమంలో అన్నీ జెండాలను మాయం చేసి పెద్ద బీజేపీ జెండా వచ్చినట్లుగా కనికట్టు చేశారు. అయితే ఈ తంతు వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

English summary
BJP leader Ajay Diwakar demonstrates trick to combine flags of three political parties into one BJP flag, during campaigning in Rampur for upcoming by-elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X