• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

leader Rekha: మూడు నెలలు స్కెచ్, రౌడీలేడీ కింగ్ పిన్, రౌడీసామ్రాజ్యం, గంజాయి మత్తులో !

|

బెంగళూరు: బెంగళూలో బీజేపీ నాయకురాలు, మాజీ లేడీ కార్పోరేటర్ రేఖా కదిరేష్ హత్య కేసులో ఆమె వదిన, రౌడీలేడి మాలా, మేనల్లుడు జైలుపాలైనారు. ప్లవర్ గార్డెన్ నేరసామ్రాజ్యాన్ని ఎలుతున్న లేడీ రౌడీ మాలా సొంత తమ్ముడి భార్యను కిరాతకంగా హత్య చేయించిందని, ఆమె హత్య కేసులో కింగ్ పిన్ అని వెలుగు చూడటంతో కిలాడిని, ఆమె కొడుకును అరెస్టు చేశారు. గతంలో ఇద్దరు రౌడీల హత్య కేసుల్లో జైలు జీవితం గడిపిన లేడీ రౌడీ ఇప్పుడు సొంత కుటుంబ సభ్యుల హత్య కేసులో మరోసారి కటకటాలపాలైయ్యింది. రేఖా బాడీగార్డు పీటర్ ను రెచ్చగొట్టి, స్థానికులు కొందరికి గంజాయి బానిసలు చేసిన ఆమెను దారుణంగా చంపించడంలో రౌడీలేడీ మాలా సక్సెస్ అయ్యిందని పోలీసులు అంటున్నారు. ఆస్తి కోసం, రాజకీయ ఎదుగుదల కోసం, రౌడీరాజ్యం కోసం కదిరేష్ సొంత అక్కే మరదిలు రేఖాను పట్టుపగలు దారుణంగా హత్య చేయించిందని వెలుగు చూడటంతో బెంగళూరు నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Girlfriend: హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు, కాభోయే భార్య నగ్న ఫోటోలు ? ఐడీ, పాస్వర్డ్ తో ప్లాన్ !Girlfriend: హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు, కాభోయే భార్య నగ్న ఫోటోలు ? ఐడీ, పాస్వర్డ్ తో ప్లాన్ !

 బీజేపీ నాయకురాలు రేఖా దారుణ హత్య

బీజేపీ నాయకురాలు రేఖా దారుణ హత్య

ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని ఛలవాదిపాళ్య బీజేపీ మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేష్ అలియాస్ రేఖా (42) ప్లవర్ గార్డెన్ లో నివాసం ఉంటున్నారు. ప్లవర్ గార్డెన్ లోని కార్యాలయంలో నుంచి అన్నదానం చెయ్యడానికి నుంచి రేఖా కదిరేష్ బయటకు వచ్చిన వెంటనే అక్కడే ఉన్న కొందరు ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి ఆమెను నరికేశారు. కిందపడిన రేఖా కదిరేష్ గొంతుకోసేసి అనుకున్న పనిముగించుకున్న నిందితులు ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం స్నేహితులతో కలిసి ప్లవర్ గార్డెన్ నుంచి పరారైనారు.

పక్కాస్కెచ్ తో ఫలితంలేదు

పక్కాస్కెచ్ తో ఫలితంలేదు

బీజేపీ నాయకురాలు రేఖా కదిరేష్ గొంతు పూర్తిగా తెగిపోవడంతో ఆమె కేకలు వెయ్యలేకపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రేఖాను కెంపేగౌడ ఆసుపత్రికి తరలించారు. గొంతు పూర్తిగా తెగిపోవడం, శరీరం మీద కత్తిపోట్లు ఎక్కువ పడడటంతో చికిత్స విఫలమై రేఖా ప్రాణాలు పోయాయి. బెంగళూరులో మాజీ కార్పోరేటర్, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకురాలు రేఖా కదిరేష్ హత్యకు గురి కావడం బెంగళూరులో కలకలం రేపింది.

మూడు నెలల నుంచి స్కెచ్

మూడు నెలల నుంచి స్కెచ్

రేఖా కదిరేష్ ను హత్య చెయ్యాలని గత మూడు నెలల నుంచి స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రేఖా కదిరేష్ కార్యాలయానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రేఖా కార్యాలయానికి ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పైకి, పక్కకు తిప్పేశారు. పక్కాప్లాన్ ప్రకారమే మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేష్ ను హత్య చేశారని పోలీసులు గుర్తించారు.

కేసు కాటన్ పేట్ పోలీసుల చేతికి

కేసు కాటన్ పేట్ పోలీసుల చేతికి


బెంగళూరులోని మాగడి రోడ్డు సమీపంలోని సుమనహళ్ళి సమీపంలోని శ్రీ శనిమహాత్మస్వామి దేవాలయం సమీపంలో రేఖా హత్య కేసులో నిందితులు రేఖ బాడీగార్డు పీటర్, సూర్యా పారిపోవడానికి ప్రయత్నించారు. కాటన్ పేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ శివస్వామి నిందితులను లొంగిపోవాలని చెప్పారు. పోలీసుల మీద కత్తులతో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించిన పీటర్, సూర్య మీద ఇన్స్ పెక్టర్ శివస్వామి కాల్పులు జరిపి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో పీటర్, సూర్య, స్టీఫెన్ రేఖా హత్య వెనుక ఆమె వదిన మాలా, ఆమె కొడుకు అరుల్ ఉన్నారని చెప్పడం కలకలం రేపింది.

హత్య కేసులో అక్కా తమ్ముడు

హత్య కేసులో అక్కా తమ్ముడు


మాజీ కార్పోరేటర్ కదిరేష్ తమిళ సోదరుడు. బెంగళూరులోని ప్లవర్ గార్డెన్ లో కదిరేష్ సెటిల్ అయ్యాడు. కదిరేష్ అక్క మాలా తమిళనాడులో ఉండేది. బెంగళూరులో కదిరేష్, అతని సోదరి మాలా కలిసి రౌడీషీటర్ జోపోడి రాజేంద్రను హత్య చెయ్యడంతో అప్పట్లో ఇద్దరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పుడే రౌడీషీటర్ జాబితాలోకి కదిరేష్, అతని అక్క మాలా పేర్లు చేరిపోయాయి. జైలు నుంచి బయటకు వచ్చిన కదిరేష్ రాజకీయాల్లోకి వచ్చాడు. మాలా కూడా జైలు నుంచి బయటకు వచ్చి ప్లవర్ గార్డెన్ లో ఉండిపోయి లేడీరౌడీగా మారిపోయింది.

తమ్ముడి హత్యతో అక్క నేరసామ్రాజ్యం

తమ్ముడి హత్యతో అక్క నేరసామ్రాజ్యం

కదిరేష్ రేఖాను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కంటే రేఖాతోనే ఎక్కువగా కాలం గడిపిన కదిరేష్ ఆమెను కార్పోరేటర్ ను చేశాడు. రేఖా పేరుకు మాత్రమే కార్పోరేటర్ గా ఉన్నా అన్ని పనులు మాత్రం కదిరేష్ చేసేవాడు. కదిరేష్ అతని అక్క మాలా కుటుంబానికి ఆర్థికంగా పూర్తి సహకారం ఇచ్చాడు. 2018లో కదిరేష్ హత్యకు గురైన తరువాత రేఖా సీన్ లోకి వచ్చి ఆ ఏరియాలో కదిరేష్ వర్గంలో పెత్తనం మొత్తం ఆమె చేతుల్లోకి తీసుకుంది. కదిరేష్ కుటుంబ సభ్యులు ఎవ్వరికి రేఖా ఆర్థిక సహాయం చెయ్యకపోవడంతో అక్కడ కథ రివర్స్ అయ్యింది. రేఖా సమాజసేవ చేస్తూ ప్రజలకు దగ్గర అయ్యింది. తమ్ముడి కదిరేష్ రౌడీరాజ్యానికి అతని అక్క మాలా లేడీ గ్యాంగ్ లీడర్ అయ్యింది.

 మరో హత్య కేసులో జైలుకు మాలా

మరో హత్య కేసులో జైలుకు మాలా

ప్లవర్ గార్డెన్ లో నివాసం ఉంటున్న గార్డెన్ మణి అలియాస్ గార్డెన్ దాస అనే వ్యక్తిని మాలా హత్య చేసి జైలుకు వెళ్లి మళ్లీ బెయిల్ మీద బయటకు వచ్చింది. మరో వ్యక్తి కాలు పూర్తిగా నరికేసి మళ్లీ జైలుపాలైయ్యింది. రెండు మూడు హత్య కేసులతో పాటు అనేక నేరాలు చేసి జైలుకు వెళ్లి బయటకు వచ్చిన మాలా ఛలవాదిపాళ్యలో గంజాయి విక్రయిస్తూ డబ్బులు సంపాధించింది. ఇదే సమయంలో కొందరు చిల్లర రౌడీలు ఎంజాయ్ చెయ్యడానికి గంజాయితో పాటు వారి విలాసాలకు డబ్బులు ఇస్తున్న మాలా ఆ ఏరియాలో లేడీరౌడీగా గుర్తింపు తెచ్చుకునింది.

రేఖాకు ప్రియుడు ఉన్నాడని అనుమానం ?......ఫస్ట్ చంపేయండి

రేఖాకు ప్రియుడు ఉన్నాడని అనుమానం ?......ఫస్ట్ చంపేయండి


కదిరేష్ హత్యకు గురైన తరువాత అతని భార్య రేఖా రవి అనే వ్యక్తితో తిరుగుతోందని మాలాకు అనుమానం పెరిగిపోయింది. కదిరేష్ హత్యకు గురైన తరువాత భర్త కుటుంబ సభ్యులు అందర్ని రేఖా దూరం పెట్టడంతో ఆ విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. కదిరేష్ ఆస్తిని మొత్తం రేఖా అనుభవిస్తోందని, మాకు ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదని మాలా కుటుంబ సభ్యులు రగిలిపోయారు. ఇదే సమయంలో రేఖా వెంట ఉంటున్న పీటర్, స్టీఫెన్ తదితరులను రెచ్చగొట్టిన మాలా రేఖాను హత్య చేయించింది. రేఖాను హత్య చేస్తే ఆస్తి మొత్తం తనకే వస్తుందని, తరువాత మీకు ఏమి కావాలన్నా నేను ఇస్తానని మాలా హంతకులకు హామీ ఇచ్చిందని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు.

 ఆడపడుచు హత్య కేసులో జైల్లో రౌడీలేడి

ఆడపడుచు హత్య కేసులో జైల్లో రౌడీలేడి

బెంగళూరు బీజేపీ నాయకురాలు, మాజీ కార్పోరేటర్ రేఖ హత్య కేసు స్టీఫెన్, పీటర్, సూర్య తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు రేఖా వదిన, లేడీ రౌడీ మాలా, ఆమె కొడుకు అరుల్ ను పోలీసులు అరెస్టు చేసి వారి స్టేట్ మెంట్ తీసుకున్నారు. మాలా, ఆమె కొడుకు అరుల్ ను న్యాయస్థానం ముందు హాజరుపరిచామని, ఇద్దరిని 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారని పోలీసు అధికారులు తెలిపారు. రేఖా హత్య కేసులో ఆమె వదిన మాలా, మేనల్లుడు అరుల్ జైలుపాలైనారు.

English summary
BJP Rekha: Bengaluru BJP leader Rekha kadiresh Murder case: west division police have been arrested kadiresh sister Rowdy Mala and her son Arul.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X