వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నాకే కరోనా వస్తే మమతా బెనర్జీని హత్తుకుంటా’: ఆ బీజేపీ నేతపై కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనుపమ్ హజ్రాపై టీఎంసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఒకవేళ తనకు కరోనా సోకితే తాను మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ ఇటీవల బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులైన అనుపమ్ వ్యాఖ్యానించారు.

దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం సాయంత్రం నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో బీజేపీ నేత హజ్రా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, మమతపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో సిలిగురి టీఎంసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

BJP leader says will hug Mamata Banerjee if infected with Covid, complaint filed

'మన కార్యకర్తలు కరోనా కంటే పెద్ద శత్రువుతో పోరాడుతున్నారు. వారంతా మమతా బెనర్జీతో పోరాడుతున్నారు. మమతా బెనర్జీతోనే మాస్కులు లేకుండా పోరాడుతున్న మన బీజేపీ కార్యకర్తలు.. కరోనాతో మాస్కులు ధరించకుండానే పోరాడగలరు' అని అనుపమ్ హజ్ర వ్యాఖ్యానించారు.

'నేను నిర్ణయించుకున్నా. ఒక వేళ నాకు కరోనా సోకితే.. నేను వెళ్లి మమతా బెనర్జీని హత్తుకుంటా' అంటూ అనుపమ్ హజ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, గతంలో టీఎంసీలో పనిచేసిన ఈ మాజీ ఎంపీ.. గత సంవత్సరమే బీజేపీలో చేరారు.
కరోనా కేసులు పెరుగుతున్నా.. సీఎం మమతా బెనర్జీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

'కరోనా బాధితులను మమతా బెనర్జీ దారుణంగా చూస్తున్నారు. వారి మృతదేహాలను కిరోసన్ పోసి తగలబెడుతున్నారు. కనీసం వారి కుటుంబసభ్యులకు ముఖం కూడా చూపించడం లేదు. మనం కుక్కలు, పిల్లులు చనిపోయినా అలా చేయలేం' అని అనుపమ్ హజ్రా అన్నారు.

కాగా, సీనియర్ టీఎంసీ నేత సౌగతో రాయ్.. అనుపమ్ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ మానసిక స్థితికి ఆయన వ్యాఖ్యలు నిదర్శనమని అన్నారు. అవి మతిలేని వ్యాఖ్యలని మండిపడ్డారు. ఆ బీజేపీ నేత వ్యాఖ్యలకు నిరసనగా సిలిగురి టీఎంసీ నేతలు ర్యాలీ నిర్వహించారు. పోలీసులకు అనుపమ్ పై ఫిర్యాదు చేశామని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

ఈ క్రమంలో అనుపమ్ హజ్ర మాట్లాడుతూ.. మమతా బెనర్జీ గతంలో పలుమార్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ప్రధానిపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకంటే తాను చేసిన వ్యాఖ్యలు పెద్దవేం కాదని అన్నారు. తనపై ఒక కేసు నమోదు చేస్తే.. టీఎంసీ నేతలపై కనీసం 10 కేసులు నమోదు చేయాల్సిందని అన్నారు.

కాగా, బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం అనుపమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతు పలకలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ సమర్థించదని స్పష్టం చేసింది.

English summary
The Trinamool Congress has registered a complaint against newly-appointed BJP national secretary Anupam Hazra, who said that he would hug West Bengal Chief Minister Mamata Banerjee if he is infected with Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X