వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను కాల్చి, తాను ఆత్మహత్యకు ప్రయత్నించి, చివరికిలా...

భార్యను కాల్చి చంపి, తాను ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఓ బిజెపి నాయకుడు. అయతే చివరి నిమిషంలో ఆయనను ఆత్మహత్య చేసుకోకుండా మేనల్లుడు అడ్డుకొన్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

మీరట్:ఉత్తర్ ప్రదేశ్ లో ఓ బిజెపి నాయకుడు దారుణానికి దిగాడు. భార్యతో గొడవపడి ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడ ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. అయితే ఆయన మేనల్లుడు అడ్డుపడ్డాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో బిజెపి నాయకుడు కులదీప్ తోమర్ తన భార్య పూనమ్ తో గొడవపడ్డాడు. చిన్న గొడవ ఇద్దరి మధ్య పెద్దదిగా మారింది.మాటా మాటా పెరిగి భార్య పూనమ్ పై కులదీప్ చేయి చేసుకొన్నాడు. అంతే కాదు కోపాన్ని ఆపుకోలేక తన వద్ద ఉన్న తుపాకీతో భార్యను కాల్చి చంపాడు.

BJP leader shoots dead wife, attempts suicide

తాను కూడ ఆత్మహత్య చేసుకొనేందుకకు తుపాకీ ఎక్కు పెట్టాడు. అయితే తుపాకీ పేలిన శబ్దం విని కులదీప్ మేనల్లుడు వచ్చి చూడగా కులదీప్ కాల్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే మేనల్లుడు అడ్డుకొన్నాడు.

పూనమ్ ను ఆసుపత్రికి తరలించగా ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. అయితే భార్య చనిపోయిందనే భయంతో కులదీప్ పారిపోయాడు. కులదీప్ కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Bharatiya Janata Party (BJP) leader Kuldeep Tomar from Uttar Pradesh allegedly shot his wife Pooam after a heated argument
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X