వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ముఖ్యమంత్రిగా దళితులకు అవకాశం ఇవ్వండి. బళ్లారి శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు కావలి అంటూ రాజకీయ చర్చు జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా షెడ్యూల్ కులాల (దళితులు) వారికి అవకాశం ఇవ్వండి అంటూ బళ్లారి శ్రీరాములు అభిప్రాయం వ్యక్తం చేశారు.

హుబ్బళిలో మీడియాతో మాట్లాడిన బళ్లారి శ్రీరాములు కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో మల్లికార్జున్ ఖార్గే, లేదా ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ లో ఒకరు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉందని చెప్పారు.

కొన్ని వర్గాలకు చెందిన వారు ఇప్పటికే ముఖ్యమంత్రులు అయ్యారని బళ్లారి శ్రీరాములు గుర్తు చేశారు. షెడ్యూల్ కులాలు, వాల్మీకి (బోయ) కులాల వారు ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఇవ్వాలని బళ్లారి శ్రీరాములు అన్నారు. ఉప మఖ్యమంత్రి తానే ముఖ్యమంత్రి అవ్వాలని ఒక సారి కన్నీరు పెట్టుకున్నారని, ఆయనకు అవకాశం ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని బళ్లారి శ్రీరాములు చెప్పారు.

BJP leader Sriramulu said dalit leader should become CM in coalition government

బీజేపీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనే విషయం హైకమాండ్ నిర్ణయిస్తుందని బళ్లారి శ్రీరాములు అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఎర్పాటు చేసే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నిస్తే అది కాలమే నిర్ణయిస్తుందని బళ్లారి శ్రీరాములు అన్నారు.

సిద్దరామయ్య మద్దతుదారులు సిద్దరామయ్యను ముఖ్యమంత్రిని చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మల్లికార్జున్ ఖార్గేకు సీఎం అయ్యే అర్హత ఉందని సీఎం కుమారస్వామి బహిరంగ సభలో చెప్పారు. మంత్రి రేవణ్ణకు సీఎం అయ్యే అర్హత ఉందని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు సీఎం ఎవరు అవుతారు అనే విషయంలో జోరుగా చర్చ జరుగుతుంటే ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు.

English summary
BJP leader Sriramulu said dalit leader should become CM in coalition government. He said Mallikarjun Kharge or G Parameshwar may become CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X