వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ తొలి ప్రధాని భారత తొలి ప్రధానిగా ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదు: బీజేపీ నేత

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతల మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రత్లం ఝాబువా లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గుమన్ సింగ్ దమోర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మొహ్మద్ అలీ జిన్నా ఉన్నతమైన వ్యక్తి అని చాలా చదువుకున్న వ్యక్తి అని చెప్పిన గుమన్ సింగ్ ... ఆయన భారత దేశానికి ప్రధాని అయి ఉంటే దేశ విభజన జరిగేది కాదంటూ వ్యాఖ్యానించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ ప్రధాని కావడం వల్లే దేశం రెండుగా విడిపోవాల్సి వచ్చిందని గుమన్ అన్నారు. దేశ విభజన పాపం కాంగ్రెస్‌ను ఎప్పుడూ వీడదని గుమన్ వ్యాఖ్యానించారు.

BJP leader stokes controversy, says With Jinnah as PM country wouldnt have been divided

భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో నెహ్రూను దేశ ప్రధానిగా ప్రతిపాదించకుండా ఉండి ఉన్నింటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు గుమన్ సింగ్. దేశం రెండుగా విడిపోయేది కాదన్నారు. మొహ్మద్ జిన్నా అప్పటికే ఒక న్యాయవాది పైగా చదువుకున్నవాడని గుమన్ సింగ్ చెప్పారు. జిన్నా ప్రధాని అయి ఉంటే లెక్క మరోలా ఉండేదన్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి శతృఘ్నసిన్హా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొహ్మద్ అలీ జిన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అంటూ చెప్పి మరో వివాదానికి తెరలేపారు. మహాత్మగాంధీ నుంచి సర్దార్ పటేల్ వరకు , మొహ్మద్ అలీ జిన్నా నుంచి జవహర్‌లాల్ నెహ్రూ వరకు వీరంతా కాంగ్రెస్ రక్తమే అని గుర్తుచేశారు. దేశం స్వాతంత్ర్యం సాధించడంలో వీరంతా ప్రముఖ పాత్ర పోషించారని చెప్పిన శతృఘ్న సిన్హా.... అందుకే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు స్పష్టం చేశారు. చింద్వారాలోని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ శతృఘ్న సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తన వ్యాఖ్యలపై కొస్త ఆలస్యంగా తెలుసుకున్న ఈ మాజీ నటుడు తన తప్పును అంగీకరించి, నోరు జారినట్లు చెప్పారు. తన మనస్సులో మౌలానా ఆజాద్ పేరు ఉన్నిందని పొరపాటున మొహ్మద్ అలీ జిన్నా పేరును ఉచ్చరించినట్లు చెప్పారు.

English summary
BJP leader Guman Singh Damor landed in a controversy by saying that it was Nehru who was responsible for the division of the country and had Mohammad Ali Jinnah been the first PM then the partition would not have happened. Since Jinna was a educated man and an advocate, thing would have been different, said Guman Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X