వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ సీనియర్ నేత ఉమా భారతికి కరోనా పాజిటివ్... ప్రస్తుతం క్వారెంటైన్‌లో...

|
Google Oneindia TeluguNews

కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి కరోనా బారినపడ్డారు. గత మూడు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్నానని... ఇటీవల హిమాలయాల పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా సోకిందని అన్నారు. భౌతిక దూరం ఇతర కోవిడ్ నిబంధనలను పాటించినప్పటికీ కరోనా బారిన పడ్డట్లు తెలిపారు. శనివారం అర్దరాత్రి ఈ విషయాన్ని ఉమా భారతి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

రాజధానిపై కేంద్రం పాత్ర పరిమితం .. బీజేపీ వైఖరి సుస్పష్టం : దగ్గుపాటి పురంధరేశ్వరిరాజధానిపై కేంద్రం పాత్ర పరిమితం .. బీజేపీ వైఖరి సుస్పష్టం : దగ్గుపాటి పురంధరేశ్వరి

ప్రస్తుతం హరిద్వార్-రిషికేశ్ మధ్యలో ఉన్న వందేమాతరం కుంజ్‌లో క్వారెంటైన్‌లో ఉన్నట్లు ఉమా భారతి వెల్లడించారు. మరో నాలుగు రోజుల తర్వాత మళ్లీ కరోనా టెస్టులు చేయించుకుంటానని చెప్పిన ఉమా భారతి... ఒకవేళ అప్పుడు కూడా పాజిటివ్‌గా తేలితే వైద్యులను సంప్రదిస్తానని చెప్పారు. గత కొద్దిరోజులుగా తనను కలిసినవాళ్లు కరోనా టెస్టులు చేయించుకుని హోం క్వారెంటైన్‌లో ఉండాలని సూచించారు.

BJP leader Uma Bharti tests positive for coronavirus

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ,కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌,కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్,కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. అగస్టు 18న కరోనాతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా... అగస్టు 31న డిశ్చార్జి అయ్యారు. కేంద్రమంత్రి సురేష్ అంగడి,కర్ణాటక బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ ఇటీవలే కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

English summary
Bharatiya Janata Party (BJP) leader Uma Bharti has tested positive for the novel coronavirus.In a late night post on Twitter, Uma Bharti informed that she has tested Covid positive and appealed to those who had come in contact with her, to get a Covid test done.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X