బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ లీడర్ దారుణ హత్య, చిక్కుల్లో మాజీ మంత్రి వినయ్, సీబీఐ ఎంట్రీతో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ధారవాడ జిల్లా పంచాయితీ సభ్యుడు, బీజేపీ లీడర్ యోగేష్ గౌడ దారుణ హత్య కేసులో ఆరు మందిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడంతో కర్ణాటక మాజీ మంత్రి వినయ్ కులకర్ణి చిక్కుల్లో పడ్డారు. రాజకీయ కక్షలతో నే యోగేష్ గౌడ దారుణహత్యకు గురైనాడని సీబీఐ అధికారులు తెలిపారు.

అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!

జిమ్ లో వెంటాడి హత్య

జిమ్ లో వెంటాడి హత్య

2016 జూన్ 15వ తేదీ ధారవాడ జిల్లా పంచాయితీ సభ్యుడు, బీజేపీ నాయకుడు మోగేష్ గౌడ సప్తాపుర జిమ్ లో పేపర్ చదువుకుంటూ కుర్చున్నాడు. ఆ సమయంలో నిందితులు యోగేష్ గౌడ మీద మారణాయుధాలతో దాడి చేశారు. జిమ్ లో తప్పించుకోవడానికి ప్రయత్నించిన యోగేష్ గౌడను అతి కిరాతకంగా వెంటాడి కుడి చెయ్యి పూర్తిగా నరికి వేసి వేటకోడవళ్లతో దారుణంగా హత్య చేశారు.

సీబీఐ ఎఫ్ఐఆర్

సీబీఐ ఎఫ్ఐఆర్

యోగేష్ గౌడ హత్య కేసు కర్ణాటకను కుదిపేసింది. యోగౌష్ గౌడ హత్య కేసుతో మాజీ మంత్రి వినయ్ కులకర్ణి చిక్కుల్లో పడ్డారు. యోగేష్ గౌడ హత్య కేసులో బసవరాజ్ కురహట్టి, సందీప్ సౌదత్తి, విక్రం బళ్లారి, కీర్తి కుమార్ కురహట్టి, వినాయక్ కాటగి, మహాబలేశ్వర్ హోనగల్ అనే నిందితుల మీద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

మాజీ మంత్రి వినయ్ కి లింక్ ?

మాజీ మంత్రి వినయ్ కి లింక్ ?

సీబీఐ అరెస్టు చేసిన నిందితులు అందరూ ధారవాడ సెంట్రల్ జైలులో ఉన్నారు. అరెస్టు చేసిన నిందితులు మాజీ మంత్రి వినయ్ కులకర్ణి అనుచరులు అని తెలిసింది. యోగేష్ గౌడ హత్య కేసులో నిందితులు అరెస్టు కావడం, వాళ్లు వినయ్ కులకర్ణి అనుచరులు అని వెలుగు చూడటంతో మాజీ మంత్రి చిక్కుల్లో పడ్డారు.

సీబీఐ ఎంట్రీ

సీబీఐ ఎంట్రీ

2016 జూన్ 15వ తేదీ ధారవాడ జిల్లా పంచాయితీ సభ్యుడు, బీజేపీ నాయకుడు యోగేష్ గౌడను వెంటాడి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసులో మొదటి నుంచి మాజీ మంత్రి వినయ్ కులకర్ణి పేరు వినిపిస్తోంది. గత శాసన సభ ఎన్నికల ప్రచారం సమయంలో తాము అధికారంలోకి వస్తే యోగేష్ గౌడ హత్య కేసు సీబీఐకి అప్పగిస్తామని బీజేపీ ప్రచారం చేసింది.

 మాజీ మంత్రి డీకే దారిలో !

మాజీ మంత్రి డీకే దారిలో !

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 8వ తేదీ బీజేపీ ప్రభుత్వం యోగేష్ గౌడ హత్య కేసు సీబీఐకి అప్పగించింది. యోగేష్ గౌడ హత్య కేసు సీబీఐ చేతికి వెళ్లడంతో మాజీ మంత్రి వినయ్ కులకర్ణి చిక్కుల్లో పడ్డారు. మాజీ మంత్రి డీకే. శివకుమార్ ఇప్పటికే అరెస్టు కావడంతో మాజీ మంత్రి వినయ్ కులకర్ణి సైతం ఆందోళకు గురౌతున్నారని తెలిసింది.

English summary
KarntKa: The Central Bureau of Investigation has filed an FIR against six persons and unknown others in connection with the murder of BJP worker Yogesh Gowda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X