వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం : రాష్ట్రపతికి లక్ష్మణ్ ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ తప్పిదం వల్లే విద్యా కుసుమాలు నేలరాలయాని పేర్కొన్నారు. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేసింది.

రాష్ట్రపతికి ఫిర్యాదు ..
రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు .. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని బృందం ఫిర్యాదు చేసింది. విద్యార్థుల మృతికి గల కారణాలపై దర్యాప్తు చేయించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతిని వారు కోరారు. పిల్లల ఆత్మహత్యపై కోవింద్ బాధపడ్డారని లక్ష్మణ్ మీడియాకు తెలిపారు. విచారణ జరిపించాలన్న విజ్ఞప్తికి కోవింద్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులవి ఆత్మహత్యలు కాదని .. ప్రభుత్వ హత్యలని ఆరోపించారు లక్ష్మణ్.

Recommended Video

ఎందుకింత పక్షపాతం- లక్ష్మణ్
bjp leaders complaint to president about inter students suicide

నిర్లక్ష్యం ఖరీదు ...
ప్రభుత్వ తప్పిదం వల్లే దాదాపు 27 మంది విద్యార్థులు చనిపోయారని గుర్తుచేశారు లక్ష్మణ్. కానీ వారు కుటుంబాలను ప్రభుత్వం పట్టించేకోలేదని విమర్శించారు. ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. కానీ మళ్లీ ఆ సంస్థకే రీ వెరిఫికేషన్ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యకు బాధ్యత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినా .. కేసీఆర్ సర్కార్ పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు లక్ష్మణ్.

English summary
BJP leaders have complained to President Ramnath Kovind over the suicide of inter-students in Telangana state. He was asked to investigate the incident. Telangana Government's mistake is that students dead. It is clear that the fight will continue until the students' families get justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X