వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లూ ఫిల్మ్ ఎప్పుడైన చూశారా ? ఎలా ఉంటుందో తెలుసా ? ప్రజలకు సీఎం సూటి ప్రశ్న !

మీరు ఎప్పుడైనా బ్లూ ఫిల్మ్ చూశారా ? బహిరంగ సభలో ప్రజలకు సీఎం సిద్దరామయ్య సూటి ప్రశ్న దేశంలో లంచం చెక్ రూపంలో తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బహిరంగ సమావేశంలో బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మీకు బ్లూ ఫిల్మ్ అంటే ఏమిటో తెలుసా ? మీరు బ్లూ ఫిల్మ్ ఎప్పుడైనా చూశారా ? అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

బ్లూ ఫిల్మ్ చూసే నాయకులు మీకు అవసరమా ? అలాంటి నాయకుడు మీకు ఎమ్మెల్యేగా, మంత్రిగా కావాలా ? అంటూ ప్రశ్నించారు. సీఎం సిద్దరామయ్య బ్లూ ఫిల్మ్ అనే మాట మాట్లాడటంతో ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు చప్పట్లు కొట్టి ఈలలు వెయ్యడంతో సభ దద్దరిల్లింది.

బీజేపీ టార్గెట్

బీజేపీ టార్గెట్

బెళగావి (బెల్గాం) జిల్లాలోని అథణి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం సిద్దరామయ్య మాట్లాడారు. ఆ సందర్బంలో మాజీ మంత్రి లక్ష్మణ సవది (బీజేపీ)ని టార్గెట్ చేసుకుని విమర్శించారు. లక్ష్మణ సవది గతంలో మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు.

బ్లూ ఫిల్మ్ చూశారు

బ్లూ ఫిల్మ్ చూశారు

లక్ష్మణ సవదిని మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారు ? అంటూ స్థానిక ప్రజలను ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆయన గారు బ్లూ ఫిల్మ్ చూస్తున్నారని వెలుగు చూడటంతో మంత్రి పదవి నుంచి తొలగించారని సిద్దరామయ్య గుర్తు చేశారు.

అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్ చూడాలా ?

అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్ చూడాలా ?

అసెంబ్లీ అంటే దేవాలయం అని సీఎం సిద్దరామయ్య అన్నారు. అలాంటి అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్ చూసే నాయకుడిని మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తారా ? అని సిద్దరామయ్య ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు బ్లూ ఫిల్మ్ చూసే అలావాటు ఉందని మీకు తెలుసు. అలాంటి వ్యక్తిని మీరు కచ్చితంగా ఓడించాలని సిద్దరామయ్య పిలుపునిచ్చారు.

దేశ చరిత్రలోనే నెంబర్ వన్

దేశ చరిత్రలోనే నెంబర్ వన్

అధికారంలో ఉన్న సమయంలో చెక్ రూంలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మాత్రమే అని సిద్దరామయ్య అన్నారు. అలాంటి యడ్యూరప్ప అవినీతి గురించి మాట్లాడటం వింటే నాకే సిగ్గుగా ఉందని ఎద్దేవ చేశారు.

సీఎంగా అన్ని హామీలు !

సీఎంగా అన్ని హామీలు !

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యిందని సీఎం సిద్దరామయ్య అన్నారు. మేము ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు దాదాపుగా నేరవేర్చామని అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ లాగా ప్రజలను మోసం చెయ్యలేదని సిద్దరామయ్య అన్నారు.

నరేంద్ర మోడీ చెప్పాలి ?

నరేంద్ర మోడీ చెప్పాలి ?

ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాను అని ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యంగా చెప్పుకుంటారా ? అని సిద్దరామయ్య సూటిగా ప్రశ్నించారు. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని ఇదే సందర్బంలో సిద్దరామయ్య విమర్శించారు.

 బీజేపీ నాయకులు అంటేనే !

బీజేపీ నాయకులు అంటేనే !

అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీజేపీ నాయకులు అంటూ సీఎం సిద్దరామయ్య విమర్శించారు. వారికి ఎంత సేపు ప్రజల నెత్తిన చేతులు పెట్టి అడ్డంగా డబ్బు సంపాధించాలనే పాకులాడుతారని సిద్దరామయ్య విమర్శించారు. పనిలో పనిగా బీజేపీ నాయకులను తీవ్రస్థాయిలో విమర్శించిన సిద్దరామయ్య కర్ణాటకలో మళ్లీ మనం (కాంగ్రెస్) అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

English summary
BJP Leaders don't have a rights to talk about corruption, Karnataka CM Siddaramaiah in Athani (Belagavi dist). Yeddyurappa is the only politician in the country who took bribe through cheque.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X