వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ కొత్త ప్రోగ్రామ్.. ప్రతిపక్ష కుట్రల్ని చీల్చిచెండాడేలా.. నేతలకు నడ్డా సూచనలు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తలెత్తడానికి కారణం.. వాటిపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేయడమేనని బీజేపీ బలంగా విశ్వసిస్తున్నది. ఆ రెండు చట్టాల వల్ల భారతీయులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గట్టిగా ప్రచారం చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు దేశవ్యాప్తంగా కొత్త కార్యక్రమాన్ని రూపొందించనుంది. దీనికి సంబంధించి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సోమవారం అన్ని రాష్ట్రాల బీజేపీ జనరల్ సెక్రటరీలు, ఇతర ముఖ్యనేతలతో భేటీ కానున్నారు.

BJP: పౌరసత్వ చట్టం పర్వంలో మరో పార్శ్యం: తిరంగా యాత్రకు కమలనాథుల శ్రీకారం.. !BJP: పౌరసత్వ చట్టం పర్వంలో మరో పార్శ్యం: తిరంగా యాత్రకు కమలనాథుల శ్రీకారం.. !

ప్రజల వద్దకు పార్టీ నేతలు..

ప్రజల వద్దకు పార్టీ నేతలు..

సీఏఏ, ఎన్ఆర్సీలపై అవగాహన కల్పించడంలో భాగంగా బీజేపీ ముఖ్యనేతలు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆయా సిటీలు, పట్టణాల్లోని ప్రముఖుల్ని, ప్రజాసమూహాల్ని కలిసి సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాల ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తారు. పొరుగుదేశాల్లో మతపరమైన పీడ ఎదుర్కొన్న ముస్లిమేతరుల కోసమే సీఏఏ రూపొందిందని, దేశంలోని అక్రమవలసదారుల్ని ఎరేయటానికే ఎన్ఆర్సీ తీసుకొచ్చిన విశయాన్ని బీజేపీ నేతలు ప్రచారం చేస్తారు. మొదటి విడతగా జనవరి 15 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

 ఇప్పటివరకు ఎంపిక చేసిన నేతలు ఎవరెంటే..

ఇప్పటివరకు ఎంపిక చేసిన నేతలు ఎవరెంటే..

ప్రభుత్వం రూపొందిచిన చట్టాలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్టవేస్తూ, వాస్తవాల్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ఎంపిక చేసిన నేతల జాబితాలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడల మంత్రి కిరన్ రిజిజు, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఇంకొంత మంది నేతల పేర్లను కూడా వెల్లడించనున్నట్లు తెలిసింది.

మోదీ మాటతో..

మోదీ మాటతో..

కొద్దిరోజుల కిందట ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్ఆర్సీలపై ప్రతిపక్ష పార్టీలు ఏవిధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయో వివరించిన తీరు జనంలోకి చొచ్చుకెళ్లింది. మోదీ ప్రసంగం తర్వాతే దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీ అనుకూల ర్యాలీలు పెరిగాయి. ఇదే ఊపులో ప్రజల్ని మరింత చైనత్యప్చే కార్యక్రమాలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ‘అవగాహన పర్యటన‘ల్ని రూపొందించినట్లు పార్టీ నేతలు తెలిపారు.

English summary
JP Nadda to address BJP leaders on deployment of partymen across the country in an effort to dispel misgivings about CAA and NRC
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X