వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో బీజేపీ జోరు: 20 స్థానాల్లో ఆధిక్యం, 7 స్థానాల్లో కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

భోపాల్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతన్నాయి. మద్యప్రదేశ్ రాష్ట్రంలో వెలువడుతున్న ఉపఎన్నికల ఫలితాల్లో మొదట్నుంచీ బీజేపీ తన హవాను కొనసాగిస్తోంది. మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. ప్రస్తుతం బీజేపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 7 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీఎస్పీ ముందంజలో కొనసాగుతున్నాయి.

Recommended Video

Counting of votes for 58 Assembly by-polls across 11 states

బీహార్‌లో బీజేపీ హవా! జేడీయూ డీలా: ఎన్డీఏ గెలిస్తే సీఎం నితీశే అవుతారా?, మోడీ పార్టీ మాటేంటి?బీహార్‌లో బీజేపీ హవా! జేడీయూ డీలా: ఎన్డీఏ గెలిస్తే సీఎం నితీశే అవుతారా?, మోడీ పార్టీ మాటేంటి?

కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం 8 స్థానాల్లో గెలిస్తే సరిపోతుంది కానీ, ఇప్పుడు 20 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుత ఫలితాల సరళి చూస్తే బీజేపీకి పూర్తి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే 114 స్థానాలు అవసరం. ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి 107 మంది సభ్యుల బలం ఉంది.

మధ్యప్రదేశ్ తోపాటు మిగితా రాష్ట్రాల్లో ఉపఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.

BJP leads in 20 seats, Congress 7 in Madhya Pradesh and other states bypolls results

గుజరాత్ రాష్ట్రంలో 8 స్థానాలకు గానూ బీజేపీ అన్ని స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉండటం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు సాస్థానాల్లో ఐదు స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో ఎస్పీ, మరో స్థానంలో ఇతరులు ముందంజలో ఉన్నారు.

ఒడిశాలో రెండు స్థానాల్లో బీజేపీ ఓ స్థానంలో ముందంజలో ఉంది. మరోస్థానంలో ఇతరులు ముందంజలో ఉన్నారు.

నాగాలాండ్ రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీలు వెనుకంజలో ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో ఒక స్థానానికి ఉపఎన్నిక జరగ్గా.. కాంగ్రెస్ అధిక్యతను చూపుతోంది.

కర్ణాటకలోని రెండు స్థానాల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది.

జార్ఖండ్ రాష్ట్రంలో రెండు స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

మణిపూర్ రాష్ట్రంలోని ఐదు స్థానాల్లో ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది.

హర్యానాలోని ఒక స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

English summary
BJP leads in 20 seats, Congress 7 in Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X