• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మణిపూర్ ఎన్నికలపై బీజేపీ నజర్; 'గో టు విలేజ్ 2.0'ని ప్రారంభించిన జేపీ నడ్డా, మణిపూర్ సీఎం

|
Google Oneindia TeluguNews

భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా శుక్రవారం మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలోని నగైఖోంగ్ ఖునౌలో 'గో టు విలేజ్ 2.0'ని ప్రారంభించారు. వచ్చే ఏడాది జరగనున్న మణిపూర్ శాసనసభ ఎన్నికల ప్రణాళికలను రూపొందించేందుకు నడ్డా రెండు రోజుల పర్యటనలో భాగంగా మణిపూర్ లో పర్యటిస్తున్నారు. రానున్న ఎన్నికల నేపధ్యంలో పార్టీని బలోపేతం చెయ్యాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

 సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా మణిపూర్ సర్కార్ గో టు విలేజ్ 2.0

సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా మణిపూర్ సర్కార్ గో టు విలేజ్ 2.0

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాల సేవలు మరియు ప్రయోజనాలను అందజేయడం కోసం ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిన గో టు విలేజ్ మిషన్, కొంత కాలం పాటు నిలిపివేయబడింది. ఇక ఇప్పుడు తాజాగా మిషన్ 'గో టు విలేజ్ 2.0'గా పునరుద్ధరించబడింది. ఈ కార్యక్రమం వివిధ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేదాకా నిర్వహిస్తున్న మిషన్ అని సీఎం బీరెన్ సింగ్ అన్నారు

ప్రజల కష్టాలను తొలగించటం కోసమే గో టు విలేజ్ 2.0

ప్రజల కష్టాలను తొలగించటం కోసమే గో టు విలేజ్ 2.0

ఈ సందర్భంగా సిఎం ఎన్ బీరేన్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షణలో చేపట్టిన వివిధ పథకాల ప్రయోజనాలను, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులకు చేరవేయడం కోసం గో టు విలేజ్ మిషన్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంకెజిఎవై) కింద ఉచిత రేషన్ పంపిణీని మార్చి, 2022 వరకు పొడిగించాలని కూడా కేంద్రం నిర్ణయించిందని ఆయన చెప్పారు. సామాజిక-ఆర్థిక కుల గణనలో లేని, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలను పొందలేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎంహెచ్టీ పథకాన్ని ప్రవేశపెట్టిందని సింగ్ చెప్పారు.

సీఎంహెచ్టీ పథకం క్రింద కొన్ని వ్యాధులకు ఉచిత చికిత్స ప్రయోజనాలు

సీఎంహెచ్టీ పథకం క్రింద కొన్ని వ్యాధులకు ఉచిత చికిత్స ప్రయోజనాలు

అర్హులైన వ్యక్తులు CMHT కింద రూ. 2 లక్షలు మరియు ఆయుష్మాన్ భారత్ కింద రూ. 5 లక్షల వరకు కొన్ని వ్యాధులకు ఉచిత చికిత్స యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చని ఆయన చెప్పారు. 'గో టు విలేజ్' మిషన్‌తో సంక్షేమ పథకాలు పొందటంతో ప్రజలు పడుతున్న కష్టాలు తొలగిపోతాయని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమం ఇంటి వద్దకే చేరుతుందని సీఎం బీరేన్ సింగ్ పునరుద్ఘాటించారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు.

మణిపూర్ సర్కార్ అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

మణిపూర్ సర్కార్ అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రం రోడ్లు, మంచినీటి సరఫరా, ఆరోగ్యం, విద్య సహా వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించిందని సీఎం పేర్కొన్నారని జేపీ నడ్డా వెల్లడించారు. ప్రతి స్టాల్‌ను సందర్శించి వివిధ పథకాల సమాచారాన్ని సేకరించడం ద్వారా ప్రజలు ఈ కార్యక్రమాన్ని గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. న్‌గైఖోంగ్ ఖునౌ ప్లేగ్రౌండ్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ ప్రాసెస్‌లో ఉందని సిఎం ప్రకటించారని పేర్కొన్నారు.

బిష్ణుపూర్ లో కార్యక్రమం .. పలు స్కీం లను ప్రజలకు అందిస్తున్న సర్కార్

బిష్ణుపూర్ లో కార్యక్రమం .. పలు స్కీం లను ప్రజలకు అందిస్తున్న సర్కార్


ఈ కార్యక్రమంలో, CMHT కార్డ్‌లు, వినికిడి యంత్రాలు, PMGKAY కింద ఉచిత రేషన్, ముఖ్యమంత్రి కళాశాల మహిరోయ్ ఇ-సపోర్ట్ స్కీమ్ కింద స్మార్ట్‌ఫోన్‌లు, ఉజ్వల పథకం కింద LPG కనెక్షన్లు, వృద్ధాప్య పెన్షన్ మరియు వితంతు పింఛను పథకంతో సహా వివిధ సంక్షేమ పథకాల కింద ప్రయోజనాలు లబ్దిదారులకు పంపిణీ చేయబడ్డాయి. గో టు విలేజ్ 2.0 ఫర్ బిష్ణుపూర్ డిస్ట్రిక్ట్ అధికార యంత్రాంగం , బిష్ణుపూర్ ద్వారా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం నవంబర్ 28 వరకు కొనసాగుతుంది. జిల్లా ప్రజలకు సేవలను అందించడానికి బ్యాంకులతో సహా 33 విభాగాల నుండి దాదాపు 68 స్టాల్స్ వేదిక వద్ద ఏర్పాటు చేయబడ్డాయి.

English summary
The BJP is keeping an eye on the Manipur elections. JP Nadda, who launched 'Go to Village 2.0', said the government would take up the program to ensure that the welfare schemes of the Manipur reach the people to the last person.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X