వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 లోకసభ నియోజక వర్గాల ఇన్ చార్జ్ గా మాస్ లీడర్, బీజేపీ పక్కాప్లాన్, సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీలకు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దళితులను భారీ సంఖ్యలో పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములును దళితులను ఆకర్షించడానికి సిద్దం కావాలని బీజేపీ నాయకులు సూచించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 7 లోకసభ నియోజక వర్గాల ఎన్నికల భాద్యతలను బళ్లారి శ్రీరాములుకు బీజేపీ నాయకులు అప్పగించారు. అయితే 7 నియోజక వర్గాల్లోని ఆరు నియోజక వర్గాల్లో ఎంపీలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు.

రాజ్యాంగాన్ని మార్చుతాం

రాజ్యాంగాన్ని మార్చుతాం

కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ లోనే ఎక్కువ మంది దళితులు ఉన్నారు. బీజేపీకి దూరంగా ఉన్న దళితులను ఆకర్షించాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కొంతకాలం క్రితం రాజ్యాంగంలో మార్పులు చెయ్యాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో దళితులు మండిపడ్డారు. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ప్రాణాలు త్యాగం చేసి రూపోందించిన రాజ్యాంగాన్ని ఎలా మార్చుతారు అంటూ దళితులు ఆందోళన చేశారు. ఈ నేపధ్యంలో బీజేపీ నాయకులు వివరణ ఇవ్వడంతో దళితులు కొంత శాంతించారు.

మాస్ లీడర్

మాస్ లీడర్

లోక్ సభ ఎన్నికల్లో దళితులను ఆకర్షించి ఓటర్లను పార్టీలోకి అహ్వానించాలంటే అదే దళిత వర్గానికి చెందిన శ్రీరాములును రంగంలోకి దించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. 7 రిజర్వుడ్డు లోక్ సభ స్థానాల ఎన్నికల భాద్యతలను శ్రీరాములుకు అప్పగించారు. విధాన సభ ఎన్నికల్లో బాదామి శాసన సభ నియోజక వర్గం నుంచి సిద్దరామయ్య మీద పోటీ చేసిన శ్రీరాములు దళితుల ఓట్లు బీజేపీకి రావడంలో విజయం సాధించారు. అయితే స్పల్ప మెజారిటీతో శ్రీరాములు ఓడిపోయారు.

 వేరే చాన్స్ లేదు

వేరే చాన్స్ లేదు

బీజేపీలో దళిత నాయకుడు, మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా శ్రీరాములుకు మంచి గుర్తింపు ఉంది. దళితుల్లో శ్రీరాములు మినహా అంతటి ఆకర్ణణ ఉన్న వ్యక్తి మరోకరు లేకపోవడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని లోకసభ నియోజక వర్టాల్లో విజయపుర (ఎస్సీ), బళ్లారి (ఎస్టీ), రాయచూరు (ఎస్సీ) చిత్రదుర్గ (ఎస్సీ) చామరాజనగర (ఎస్సీ) కోలారు (ఎస్సీ) నియోజక వర్గాల ప్రచార భాద్యతను శ్రీరాములకు అప్పగించారు.

సొంత సోదరి శాంత

సొంత సోదరి శాంత

బీజేపీ నాయకులు శ్రీరాములుకు అప్పగించిన లోక్ సభనియోజక వర్గాల్లో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. 7 లోక్ సభ ఎన్నికల్లో గతంలో విజయపుర లోక్ సభ నియోక వర్గంలోనే బీజేపీ గెలిచింది. బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల్లో సొంత సోదరి శాంతను గెలిపించుకోలేదని శ్రీరాములు అపవాదు మూటకట్టుకున్నారు.

కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలు

కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలు

బళ్లారి లోకసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు ఉగ్రప్ప విజయం సాధించారు. కలబరిగిలో మల్లికార్జున ఖార్గే, రాయచూరులో బివి. నాయక్ చిత్రదుర్గలో చంద్రప్ప, చామరాజనగరలో ఆర్. దృవనారాయణ్, కోలారులో కేహెచ్. మునియప్ప కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా విజయం సాధించారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలు ఉన్న నియోజక వర్గాల భాద్యతలను శ్రీరాములుకు అప్పగించారు. ఎందుకంటే కర్ణాటక బీజేపీలో దళిత నాయకుల్లో శ్రీరాములుకు ఉన్న ఇమేజ్ మరే నాయకుడికి లేదని ఆ పార్టీ నాయకుల వాదన.

English summary
BJP made Sriramalu in charge for seven reservation lok sabha constituency for upcoming elections. Ramulu will handle Vijayapura, Kolar, Kalburgi, Chitradurga, Chamarajnagar, Rayachuru, Bellari constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X