వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ సమస్య పరిష్కరమే లక్ష్యంగా బీజేపి మేనిఫెస్టో..! స్థిరమైన ప్రభుత్వం దిశగా కమలం అడుగులు..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ :మేనిఫెస్టోల సీజన్ లో ఓ ముఖ్య ఘట్టం ముగిసింది. బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ ముఖ్యనేతలు కలిసి సోమవారం విడుదల చేశారు. మోదీ నేతృత్వంలో ఈ ఐదేళ్లలో అంతర్జాతీయ శక్తిగా భారత్‌ అవతరించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి.. అద్భుతమైన పాలన అందించామని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం అభివృద్ధిలో దూసుకెళుతోందన్నారు. 12 లక్షల కోట్ల స్కామ్‌లను వెలుగులోకి తెచ్చామని చెప్పారు అమీత్ షా తెలిపారు.

<strong>వాటితో పాటే ఇవి కూడా..! స్థానిక సంస్థల ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న ఈసీ..!!</strong>వాటితో పాటే ఇవి కూడా..! స్థానిక సంస్థల ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న ఈసీ..!!

 దార్శనికతతో కూడిన ప్రణాళికలు..! దేశ పురోభివ్రుద్దే ద్యేయంగా బీజేపి మేనిఫెస్టో అన్న అమీత్ షా..!!

దార్శనికతతో కూడిన ప్రణాళికలు..! దేశ పురోభివ్రుద్దే ద్యేయంగా బీజేపి మేనిఫెస్టో అన్న అమీత్ షా..!!

సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నామని, అసాధ్యాలను సుసాధ్యం చేశామని వివరించారు. కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా ఉగ్రమూలలాలను ఏరివేశామని వివరించారు. ఏడు కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని, 12 కోట్ల మంది రైతులకు సాగులో సాంకేతికతను అందించామని తెలిపారు. 2022 నాటికి 75 లక్ష్యాలను పెట్టుకున్నామని చెప్పారు. దార్శనికతతో కూడిన ప్రణాళికను తీసుకుని వస్తున్నామని అమిత్‌ షా వివరించారు.

 సీనియర్ నేత అద్వాణీ గైర్హాజరు..! కారణం ఏంటనే అంశంపై పార్టీ శ్రేణుల్లో చర్చోపచర్చలు..!!

సీనియర్ నేత అద్వాణీ గైర్హాజరు..! కారణం ఏంటనే అంశంపై పార్టీ శ్రేణుల్లో చర్చోపచర్చలు..!!

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన కార్యక్రమానికి బీజేపి సీనియర్ నేత ఎల్కే అద్వాణీ గైర్హాజరయ్యారు. ఐతే అద్వాణీ కావాలని మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి రాలేదా లేక ఆహ్వానం పంపలేదా అనే అశం పై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ నేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ తదితరులు సంకల్ప్‌ పత్ర పేరిట మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మేనిఫెస్టోలోని అంశాలను వెల్లడించారు.

బీజేపి విజన్ డాంక్యుమెంటరీ..! జనం స్వాగతిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న కమల దళం..!!

బీజేపి విజన్ డాంక్యుమెంటరీ..! జనం స్వాగతిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న కమల దళం..!!

130 కోట్ల మంది భారతీయుల కోరికలు, ఆకాంక్షలను సాకారం చేసేలా విజన్‌ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా తెలిపారు. నవభారతాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. 6 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి ఈ దార్శనిక పత్రాన్ని తయారుచేశామని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం అవినీతిని అణిచివేసిందని రాజ్‌నాథ్‌ అన్నారు.

మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు..! బీజేపికి కలిసొస్తుందా అన్నదే ప్రశ్న..!!

మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు..! బీజేపికి కలిసొస్తుందా అన్నదే ప్రశ్న..!!

1.కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీతో రుణం. 2.రాజ్యాంగ విధివిధానాలకు లోబడి త్వరలోనే అన్ని వర్గాల ఆమోదంతో రామ మందిర నిర్మాణం. 3. 60ఏళ్లు నిండిన సన్న, చిన్నకారు రైతులకు పింఛన్‌ పథకం. 4. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందేలా చర్యలు. 5. కిసాన్‌ సమ్మన్‌ నిధి కింద రైతులకు ఏటా 6000 వేల రూపాయల ఆర్థిక సాయం. 6.వ్యవసాయ రంగానికి 25లక్షల కోట్ల రూపాయలు కేటాయింపు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు.

English summary
A major event ended in the Manifestos season. The party manifesto was released on Monday by the party chief leaders. BJP national president Amit Shah said India has emerged as an international force in these five years, under Modi's leadership. We have established a stable government in the country.However, it is clear that Advani has not come up with a manifesto release program or has not sent an invitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X