వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ ను భారతీయులు పాలించాలి, ఇటలీ రక్తం ఉన్నవారు కాదు, కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నిత్యం వివాదాస్పద వాఖ్యలు చేసే కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని పాలించే వారికి భారతీయుల రక్తం ఉండాలని, విదేశీ రక్తం ఉండకూడాదని డిమాండ్ చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని సిద్దరాపురలో బీజేపీ కార్యకర్తలను ఉదేశించి మాట్లాడిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెడ్డే కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ దివాల తీస్తుందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే జోస్యం చెప్పారు. 2019లో దేశంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. ప్రస్తుతం కొంత మంది నాయకులు దేవాలయాలకు వెళ్లడం మొదలు పెడుతున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీని విమర్శించారు.

BJP minister Anant Kumar Hegde says, India should rule by Indians not by Italians.

మసీదులు, చర్చిలకు వెళ్లే లీడర్లు దేవాలయాలకు వెళ్తి తాము హిందూ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఆరోపించారు. తండ్రి ముస్లీం, అమ్మ క్రిస్టియన్, కొడుకు హిందూ అని పరోక్షంగా రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ విమర్శించారు.

ఇలాంటి హై బ్రీడ్ విత్తనాలు ఇప్పుడు దేశాన్ని ఉద్దరిస్తామని బయలుదేరారని రాహుల్ గాంధీ మీద కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 60 సంవత్సరాల పాలనలో బీజేపీ పాలనకు, ఇతర పార్టీల పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని, అది ప్రజలు గమనించాలని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే అన్నారు.

ఐదు సంవత్సరాల మోడీ పాలన గురించి ప్రజలకు వివరించడం తమ ముఖ్యఉద్దేశం అని, హైబ్రీడ్ విత్తనాల పాలన వద్దని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మనల్ని జూ (జంతు ప్రదర్శన శాల)లో పెట్టారని, పేదలను బిక్షగాళ్లను చేశారని కాంగ్రెస్ పార్టీ మీద కేంద్ర కేంద్ర మంత్రి విమర్శలు చేశారు.

English summary
BJP minister Anant Kumar Hegde says, India should rule by Indians not by Italians. He also said every one telling that 'i am hindu' for vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X