వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళ్లతో తన్నిన మహిళకు క్షమాపణ చెప్పిన గుజరాత్ ఎమ్మెల్యే... అనంతరం రాఖీ కట్టిన మహిళ

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాళ్లతో తన్నిన మహిళకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే...!! || Oneindia Telugu

ఎన్సీపీ మహిళా నాయకురాలను తిడుతూ కాలితో తన్నిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే బలరాం తహావాని ఎట్టకేలకు దిగివచ్చాడు. మహిళను తిడుతూ..కాళ్లతో తంతున్న వీడీయో సోషల్ మీడియా వైరల్ కావడంతో ఆ మహిళకు క్షమాపణ చెప్పాడు.అయితే వీడీయో వైరల్ అయిన తర్వాత ఎమ్మెల్యే క్షమాపణలు కోరినా ఎన్సీపీ మహిళా నేత మాత్రం అంగీకరించలేదు. ఎట్టకేలకు ఆమే కూడ ఎమ్మెల్యే తిరిగి మరోసారి క్షమాపణ చెప్పడంతో అమే అంగీకరించింది. అనంతరం ఎమ్మెల్యేకు రాఖీ కూడ కట్టింది.

గత కొద్ది రోజుల క్రితం నీతు తేజ్వాని అనే మహిళ నరోడాలోని నీటీ సమస్యపై ఎమ్మెల్యే తమ్ముడు కార్పోరేటర్ అయిన కిషోర్ తవాని ఇంటికి వెళ్లింది. అయితే ఆ సమస్యను పట్టించుకోకపోగా తిరిగి మహిళను కార్పోరేటర్ అనుచరులు తీవ్రంగా దూషించారు. దీంతో తెజ్వాని ఎమ్మెల్యే బలరాం ఇంటికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంతంలో ఉన్న మహిళలను వెంట తీసుకుని వెళ్లింది.దీంతో ఎమ్మెల్యే అనుచరులు సైతం తెజ్వానితో పాటు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన ఎన్సీపీ కార్యకర్తలను దూషిస్తూ దాడికి దిగారు. ఆ సమయంలోనే వచ్చిన ఎమ్మెల్యే సైతం ఆమే దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ను గుంజుకుని తిడుతూ కాళ్లతో తన్నాడు. దీంతో ఆ వీడీయో వైరల్ అయింది.

BJP MLA Balram Thawani has apologised after a video of him beating and kicking a woman

ఇక దీనిపై గుజరాత్ రాష్ట్ర్ర బీజేపీ సైతం ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. దీంతో దిగివచ్చిన ఎమ్మెల్యే నేరుగా తేజ్వాని ఇంటికి వెళ్లి క్షమాపణ కోరాడు. అయితే తమను ప్లాన్ ప్రకారమే హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆమే ఆరోపణలు చేసింది. దీంతో వివాదం ముదిరింది. దీంతో మరోసారి ఆమే ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ఆమేను ఒప్పించాడు. గతంలో ఇలాంటీ సంఘటనలు జరగలేదని, చెప్పారు. దీంతో ఆమే ఎమ్మెల్యే క్షమాపణలు అంగీకరించింది.అనంతరం ఎమ్మెల్యేకు రాఖీ కట్టింది. ఎమ్మెల్యే తన పెద్దన్నగా పేర్కోంది.

English summary
gujarat Bharatiya Janata Party (BJP) MLA Balram Thawani has apologised after a video of him, beating and kicking a woman Nationalist Congress Party (NCP) leader in Naroda, went viral
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X