వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమరి తల్లుల వల్లే మ్యాగీ అమ్మకాలు పెరిగాయి: ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఇండోర్‌: ఈతరం తల్లులు సోమరులుగా మారడం వల్లనే దేశంలో మ్యాగీ అమ్మకాలు పెరిగాయని భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘తల్లులు అంత సోమరులుగా ఎందుకు మారారో తెలియదు. వారు తమ పిల్లలకు రెండు నిమిషాల్లో తయారయ్యే ఆహారాన్ని తినిపిస్తున్నారు. మా తరానికి చెందిన తల్లులు ఇంట్లో తయారు చేసిన పరాఠా, హల్వా, సేమియా తినిపించేవారు' అని మధ్యప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ పేర్కొన్నారు.

భారతీయ తల్లుల గురించి బిజెపి మహిళా ఎమ్మెల్యే అలా మాట్లాడటాన్ని కాంగ్రెస్‌ ఖండించింది. ఆమె తల్లులందరినీ అవమానించారని మధ్యప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు అర్చనా జైశ్వాల్‌ అన్నారు. అయితే.. మ్యాగీపై నిషేధానికి బిజెపి ఎమ్మెల్యేతో పాటు, వర్తక సంఘాలూ మద్దతు పలికాయి.

 BJP MLA blames 'lazy' mothers for rise in Maggi sales

ఆలిండియా వర్తక సమాఖ్య (సీఏఐటీ) అయితే.. మ్యాగీలో లేని దాన్ని ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా ఎలా ప్రచారం చేస్తారని కేంద్రాన్ని ఒక ప్రకటనలో ప్రశ్నించింది. మ్యాగీ ప్యాక్‌పై ‘గ్రైన్‌ శక్తి' అని ఉంటుందని.. అది ఏ ధాన్యమో, ఎంత శక్తి ఉంటుందో, శక్తి అంటే ఆ సందర్భంలో ఏమిటో వివరాలేమీ ఉండవని భాటియా తన లేఖలో వివరించారు.

అయితే.. అవి ఏ పిండితో తయారైన రోటీలో, ఒక రోటీలో ఎంత ఫైబర్‌ ఉంటుందో వివరాలేవీ కొనుగోలుదారుకు తెలియవని ఆయన వాపోయారు. సదరు ఆహారం తింటే ఆరోగ్యమని, ఎలాంటి శాస్త్రీయ సమాచారం లేకుండా వినియోగదారులకు హామీ ఇచ్చే వారిది బాధ్యతారాహిత్యమేనని భాటియా వివరించారు.

English summary
With many States banning Maggi noodles over food safety concerns, a Bharatiya Janata Party MLA has sought to blame “new generation mothers”, saying they have become “lazy” and hence feed their children the two-minute noodles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X