• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆప్ఘాన్ తాలిబన్ల కారణంగా పెట్రో, గ్యాస్ ధరల్లో పెరుగుదల: బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

|

బెంగళూరు: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలపై దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులపై భారం మోపుతున్నారంటూ కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బీజేపీ ప్రజాప్రతినిధి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఏర్పడ్డ సంక్షోభంతోనే భారతదేశంలో ఇంధన, గ్యాస్ ధరలు పెరిగాయని చెప్పుకొచ్చారు కర్ణాటకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్. హుబ్లీ-ధార్వాడ్ పశ్చిమ నియోజకర్గం ఎమ్మెల్యే అరవింద్ శనివారం మాట్లాడుతూ.. తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘనిస్థాన్‌లో ఏర్పడ్డ సంక్షోభం కారణంగానే ముడి చమురు సరఫరా తగ్గిపోయిందన్నారు.

ఫలితంగానే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయని.. గత ఆగస్టు నెల మధ్య ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ధరలు మరింతగా పెరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.

 BJP MLA Blames Taliban For Fuel Prices Hike In India

కాగా, భారత్ ఆరు దేశాల నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటోంది. వాటిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నైజీరియా, అమెరికా, కెనడా ఉన్నాయి. ఆప్ఘాన్ నుంచి కూడా చమురు దిగుమతి చేసుకుంటోంది.. కానీ, అది తక్కువ మొత్తంలోనేనని జులైలో రూటర్ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది. తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘాన్‌లో ఇప్పటి వరకు తలెత్తిన పరిస్థితుల కారణంగా భారత్‌లో చమురు ధరలపై ప్రభావం లేదని సంబంధితన నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. అక్కడి పరిణామాలతో భారత్‌లో చమురు ధరలపై అధిక ప్రభావం ఉండకపోవచ్చునని చెబుతున్నారు. కాగా, దేశంలో పలు చోట్ల పెట్రోల్ ధరలు రూ. 100 చేరిన విషయం తెలిసిందే. వంటగ్యాస్ ధరలు 884.50 రూపాయలకు చేరుకుంది.

ఇది ఇలావుండగా, ఆప్ఘాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. అయితే, భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నడంలో ముందుండే పాకిస్థాన్, చైనాలు తాలిబన్లకు మద్దతు ఇవ్వడమే భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. కాశ్మీర్ విముక్తి కోసం తాలిబన్లు ముందుకు రావాలని ఇప్పటికే పాకిస్థాన్ కోరిన విషయం తెలిసిందే.

  Karnataka Scorpion Festival : విష పురుగులతో గేమ్స్.. భారీగా జనాలు || Oneindia Telugu

  కాగా, ఆప్ఘనిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుు తాలిబన్లు తమ అజెండా బయటపెట్టారు. తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఆఫ్గనిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి, పునర్నిర్మించడానికి చైనా సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు, చైనా ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశ ద్వారం అందిస్తుందని ఆశించినట్లు బ్రిటన్ నుంచి వెలువడే ఎక్స్‌ప్రెస్ పత్రిక వెల్లడించింది. "చైనా మా ప్రధాన భాగస్వామి, మా దేశంలో పెట్టుబడి పెట్టడానికి, పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్నందున మాకు ప్రాథమిక, అసాధారణమైన అవకాశాన్ని ఇది అందిస్తుందని ముజాహిద్ వెల్లడించాడు. పురాతన సిల్క్ రోడ్‌ని పునరుద్ధరించడానికి ఉపయోగపడే వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్‌ను తాము గౌరవిస్తామని, దీనికి మించి తమ వద్ద గొప్ప రాగి గనులు ఉన్నాయిని, అవి చైనీయుల కోసం తిరిగి ఉత్పత్తిలోకి తీసుకొస్తామని తాలిబన్ నేత ముజాహిద్ వెల్లడించారు. ఆఫ్ఘన్ లో పెట్టుబడులు, అంతర్జాతీయ గుర్తింపు, వాణిజ్యం వంటి విషయాల్లో చైనా నుంచి గట్టి హామీ లభించడంతో ఇప్పుడు చైనాను తమ మిత్రదేశంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.

  English summary
  BJP MLA Blames Taliban For Fuel Prices Hike In India.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X