వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందువుల ఆస్తులు ముస్లీంలు కొనకుండా యాక్ట్ చేయాలి: బిజెపి ఎమ్మెల్యే

హిందువుల ఆస్తులు ముస్లిములు కొనకుండా డీఏ యాక్టు ప్రయోగించాలని బిజెపికి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే జిల్లా కలెక్టరుకు లేఖ రాసి సంచలనం సృష్టించారు.

|
Google Oneindia TeluguNews

సూరత్: హిందువుల ఆస్తులు ముస్లిములు కొనకుండా డీఏ యాక్టు ప్రయోగించాలని బిజెపికి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే జిల్లా కలెక్టరుకు లేఖ రాసి సంచలనం సృష్టించారు.

సూరత్ నగరం పరిధిలోని లింబాయత్ అసెంబ్లీ నియోజకవర్గంలో హిందువుల ఆస్తులను ముస్లిములు కొనకుండా డిస్ట్రబ్డ్ యాక్టును ప్రయోగించాలని బిజెపి ఎమ్మెల్యే సంగీతా పాటిల్ కోరారు.

ఈ మేరకు సంగీత పాటిల్ సూరత్ జిల్లా కలెక్టరుకు లేఖ రాశారు. ఒక మతం వారు నివాసముంటున్న ప్రాంతాల్లో మరో మతానికి చెందిన వారు జిల్లా కలెక్టరు అనుమతి లేకుండా ఇళ్లు, ఆస్తులు కొనడాన్ని డిస్ట్రబ్డ్ యాక్టు 1991 కింద నిషేధించాలని డిమాండ్ చేశారు.

BJP MLA From Surat Seeks Imposition Of 'Disturbed Areas Act' To Prevent Muslims From Buying Properties Owned By Hindus

లింబాయత్ నియోజకవర్గంలోని గోవింద్ నగర్, భారతీనగర్, మదన్ పురా, భావనపార్కు లాంటి హిందూ పేర్లున్న ప్రాంతాల్లో ముస్లిములు హిందువులను బెదిరించి ఇళ్లు కొనుగోలు చేస్తున్నారని సంగీత కలెక్టరుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

హిందువుల ఇళ్లకు ముస్లింలు అధిక ధరలు చెల్లిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే సంగీత మతకలహాలు ప్రేరేపించేలా ప్రవర్తిస్తున్నారని సూరత్ కాంగ్రెస్ నాయకుడు అస్లాం విమర్శించారు.

English summary
BJP MLA from Surat, Sangita Patil, has demanded imposition of 'Disturbed Areas Act' in her constituency of Limbayat to prevent Muslims from acquiring residential properties of Hindus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X