వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బళ్లారి జిల్లా విభజన, గాలి రెడ్డి బ్రదర్ ఫైర్, మేమూ బీజేపీ ఎమ్మెల్యేలే సీఎం గారు, బంద్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బళ్లారి జిల్లాను విభజించి కొత్తగా విజయనగర జిల్లాను ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయిన బీజేపీ ప్రభుత్వం మీద అధికార పార్టీ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. బళ్లారి జిల్లాను విభజించడానికి తాము అంగీకరించమని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం మీద బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తాజాగా మేమూ బీజేపీ ఎమ్మెల్యేలే అనే విషయం ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యే గాలి కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు గుర్తు చేశారు.

హనీట్రాప్, దుబాయ్ రిటన్, కాలేజ్ అమ్మాయితో వల, రాసలీలలు టీవీలో చూపిస్తాం !హనీట్రాప్, దుబాయ్ రిటన్, కాలేజ్ అమ్మాయితో వల, రాసలీలలు టీవీలో చూపిస్తాం !

సీఎం ఏకపక్ష నిర్ణయం

సీఎం ఏకపక్ష నిర్ణయం

బళ్లారి జిల్లాను విభజించి విజయనగర జిల్లాను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనను సీఎం యడియూరప్ప ఇప్పటికే అంగీకరించారు. విజయనగర జిల్లాను ఏర్పాటు చెయ్యడాన్ని ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు, బళ్లారి నగర ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఇప్పటికే వ్యతిరేకించారు. ఇప్పుడు అదే కోవలో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి కరుణాకర్ రెడ్డి సైతం విజయనగర జిల్లాను ఏర్పాటు చెయ్యడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఒత్తిడి చేస్తే అంగీకరిస్తారా ?

ఒత్తిడి చేస్తే అంగీకరిస్తారా ?

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పేరు ఎత్తకుండానే కొందరు ఒత్తిడి చెయ్యడం వలనే సీఎం యడియూరప్ప విజయనగర జిల్లా ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యారని బీజేపీ ఎమ్మెల్యే గాలి కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం యడియూరప్ప బళ్లారి నాయకుల అభిప్రాయాలు సేకరించి నిర్ణయం తీసుకోలేదని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి కరుణాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

మేమూ బీజేపీ ఎమ్మెల్యేలే !

మేమూ బీజేపీ ఎమ్మెల్యేలే !

ఇప్పటికే విజయనగర జిల్లాను ఏర్పాటు చేసే విషయంలో మంత్రివర్గంలో చర్చించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం యడియూరప్ప మంత్రివర్గ కార్యదర్శికి లేఖ రాశారు. బళ్లారిలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి అభిప్రాయాలు తీసుకోలేదని, మేము బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు అయ్యాం అనే విషయం సీఎం యడియూరప్ప గుర్తు పెట్టుకుంటే మంచిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి కరుణాకర్ రెడ్డి అన్నారు. సీఎం యడియూరప్ప అంటే తమకు ఎంతో గౌరవం ఉందని, అయితే ఆయన దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గాలి కరుణాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా తెలుసుకోండి

ఇప్పటికైనా తెలుసుకోండి

హగరిబోమ్మనహళ్ళి, కోట్టూరు, హడగలితో పాటు అనేక ప్రాంతాలు ప్రత్యేక జిల్లా కావాలని కోరుకుంటున్నాయని గాలి కరుణాకర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో బళ్లారి జిల్లాలో గందరగోళం ఏర్పడిందని గాలి కరుణాకర్ రెడ్డి అన్నారు. యడియూరప్ప సీఎం అవ్వాలని తాము అందరూ మద్దతు ఇచ్చాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, యడియూరప్ప ఆలోచించి బళ్లారి జిల్లాను విభజించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని గాలి కరుణాకర్ రెడ్డి మనవి చేశారు.

బళ్లారి బంద్ కు మద్దతు

బళ్లారి బంద్ కు మద్దతు

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ విజయనగర జిల్లాను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని వినతి పత్రం ఇచ్చిన మూడు రోజుల్లోనే సీఎం యడియూరప్ప స్పందించారు. అలాగే మా నిర్ణయాలు తెలుసుకుని మాతో సంప్రధించాలని బీజేపీ ఎమ్మెల్యే గాలి కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అఖండ బళ్లారి అలాగే ఉండాలని, ఒక వేళ జిల్లాను విభజన చెయ్యాలంటే పశ్చిమ తాలుకాలకు అన్ని వైపులా దగ్గరగా ఉండే పరపనహళ్ళిని కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చెయ్యాలని గాలి కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బళ్లారి జిల్లాను వ్యతిరేకించి అక్టోబర్ 1వ తేదీ బళ్లారి జిల్లా బంద్ కు పిలుపునిచ్చారని, ఆ బంద్ కు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి కరుణాకర్ రెడ్డి అన్నారు.

English summary
Karnataka: Hagaribommanahalli BJP MLA Karunakara Reddy opposed CM BS Yediyurappa's decision on creating separate Vijayanagar district without consulting BJP MLAs of Ballari dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X