Eve-teasing: ఎమ్మెల్యే, ఆయన కొడుకు అర్దరాత్రి పోలీస్ స్టేషన్ లో హంగామా, రేయ్ లాకప్ తాళం!
లక్నో/ ఉత్తర్ ప్రదేశ్: వరుస అత్యాచారాలు, హత్యలతో హడలిపోతున్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురైయ్యింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన కొడుకు, వారి అనుచరులు పోలీస్ స్టేషన్ మీదపడి ఈవ్ టీజింగ్ కేసులో అరెస్టు అయిన నిందితులను దర్జాగా విడిపించుకుని వెళ్లిపోయారు. ఫ్యాక్షన్ సినిమా స్టైల్లో వీరహంగామా చేసిన అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఇప్పుడు నా తప్పు ఏముంది చెప్పండి ? అంటూ ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారు.
Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !

యూపీ పేరు చెబితే హడల్
ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన హథ్రాస్ అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హథ్రాస్ అత్యాచారం కేసు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నానాతిప్పలు పడుతోంది. ఉత్తర్ ప్రదేశ్ లో హత్యలతో పాటు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నా అక్కడి బీజేపీ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

బీజేపీ ఎమ్మెల్యే, ముద్దుల కొడుకు వీరంగం
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతారని, ఎవ్వరికి ములాజు ఇవ్వరని ఆరోపణలు ఉన్నాయి. అర్దరాత్రి బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్, ఆయన ముద్దుల కొడుకు, వారి మద్దతుదారులు లఖీంపూర్ పోస్టులోని మొహమ్మది పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి వీరంగం చేశారని వెలుగు చూసింది.

ఈవ్ టీజింగ్ కేసులో నిందితుడి కోసం హైడ్రామా
ఈవ్ టీజింగ్ కేసుకు సంబంధించి ఓ యువకుడిని మొహమ్మది పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈవ్ టీజింగ్ కేసులో పోలీసుల అదుపులో ఉన్న యువకుడు ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్ కొడుకు చాలా సన్నిహితుడని తెలిసింది. ఈవ్ టీజింగ్ కేసులో పోలీసుల అదుపులో ఉన్న యువకుడిని విడిపించడానికి స్వయంగా ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్ అర్దరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నానా హంగామా చేస్తున్న వీడియో ఇప్పడు బయటకు రావడంతో మీడియాలో రచ్చరచ్చ కావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రేయ్ లాకప్ తాళం తియ్యండి రా
రేయ్ లాకప్ తాళం తియ్యండిరా,,, మావాళ్లను విడిచిపెట్టండిరా అంటూ బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్, ఆయన కొడుకు కేకలు వేస్తున్న విషయం వీడియోలో కనపడుతోంది. బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్ తో పాటు అక్కడికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలను అడ్డుకోలేక మొహమ్మది పోలీస్ స్టేషన్ పోలీసులు చేతులు ఎత్తేశారు.

దర్జాగా వెళ్లిపోయిన ఎమ్మెల్యే
తరువాత తాపీగా లాకప్ లో ఉన్న ఈవ్ టీజింగ్ నిందితులను బలవంతంగా విడిపించుకున్న బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్, ఆయన కొడుకు, వారి అనుచరులు దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో తీసిన వీడియో బయటకు రావడం దూమరం రేపింది. ఇప్పటికే అధికార పార్టీ నాయకులతో యూపీ ప్రభుత్వానికి తలనొప్పి ఎదురైయ్యింది. ఇప్పుడు ఈవ్ టీజింగ్ కేసులో అరెస్టు అయిన నిందితుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగడం సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారింది.