వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘తల్లిదండ్రుల తొలిరాత్రి వీడియో అడిగే రకాలు’: కేజ్రీ, చిద్దుపై తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

భోపాల్: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులపై భారత్ జరిపిన సర్జికల్ దాడుల వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు పి చిదంబరం, సంజయ్ నిరుపమ్‌లపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత, ఎమ్మెల్యే రామేశ్వర శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

'ఆర్మీ జవాన్ల వీరత్వానికి సంబంధించిన ప్రశ్నలడుగుతున్నవారు, తల్లిదంద్రుల తొలిరాత్రి వీడియోను చూసి, వారికే పట్టామని నమ్మే రకం' అంటూ విమర్శించారు. దేశం కోసం భారత ఆర్మీ రక్తం చిందిస్తుంటే.. వారిపై నమ్మకం లేని వారు జాతి ద్రోహులేనని, వారంతా పాకిస్థానీ ఏజంట్లని, నవాజ్ షరీఫ్ అభిప్రాయం వీరి నోటీ వెంట వస్తోందని నిప్పులు చెరిగారు.

ఇక ఇదే సమయంలో అక్కడే ఉన్న బీజేపీ ఎంపీ అలోక్ సంజార్ మరో అడుగు ముందుకేసి, సర్జికల్ దాడులు నిజమేనా? అని ప్రశ్నిస్తున్న వారు, ముందు తన తండ్రి గురించి తల్లిని అడిగి రావాలని అన్నారు.

ఇది ఇలా ఉండగా, మరణాన్ని సైతం లెక్క చేయకుండా మనదేశానికి రక్షణగా ఉంటున్న భద్రతాదళాల మాట కూడా నమ్మలేని వారు.. పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారా? అని ప్రశ్నించారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.

యూరీ దాడికి పాల్పడిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 20మంది మన సైనికుల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సర్జికల్ దాడులు జరిపిన భారత్.. సుమారు 40మందికిపైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. కాగా, ఈ దాడులకు చెందిన వీడియో బయటకు విడుదల చేసే విషయంపై బుధవారం సాయంత్రంలోగా ఓ నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

English summary
Bharatiya Janata Party (BJP) leader Rameshwar Sharma, Wednesday, stooped to a new low while attacking political leaders demanding proof of Indian Army's surgical strikes in Pakistan-occupied Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X