వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లీజ్ నాన్నా.. మమ్మల్ని బతకనివ్వండి.. బీజేపీ ఎమ్మెల్యే కూతురి ఆవేదన (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఆమె ఎమ్మెల్యే కూతురు. ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో విషయం చెప్పితే కుటుంబసభ్యులు ఇంతెత్తున లేచారు. అతన్ని మర్చిపొమ్మని వార్నింగ్ ఇచ్చారు. అయితే అతనిపై ప్రేమ చంపుకోలేక కుటుంబసభ్యుల కళ్లుగప్పి ఇంట్లో నుంచి బయటపడింది. కోరుకున్న వాడితో మూడు ముళ్లు వేయించుకుంది. ఇక అప్పటి నుంచి ఆ దంపతుల కష్టాలు మొదలయ్యాయి. తండ్రి గూండాలను పంపి బెదిరిస్తుండటంతో రక్షణ కల్పించండంటూ వారిద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి.

వీడసలు తండ్రేనా : మద్యం కోసం కన్న బిడ్డనే అమ్మేశాడు..వీడసలు తండ్రేనా : మద్యం కోసం కన్న బిడ్డనే అమ్మేశాడు..

ప్రేమ పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే కూతురు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిథారి చేస్‌పూర్ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సాక్షి మిత్రా. అజితేశ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. ప్రియున్ని పెళ్లి చేసుకుంది. అయితే తాము పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఎమ్మెల్యే అయిన తన తండ్రి వేధిస్తున్నాడని సాక్షి ఆరోపిస్తోంది. తమను ప్రాణాలతో బతకనిచ్చేలా లేరని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తండ్రిపై తీవ్ర ఆరోపణలు

తండ్రిపై తీవ్ర ఆరోపణలు


సాక్షి పోస్ట్ చేసిన వీడియోలో తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన వద్ద పనిచేసే కొంతమంది గూండాలు తమను వెంబడిస్తున్నారని, వారిని అలాగే వదిలేస్తే తమను చంపేస్తారని ఆవేదన వ్యక్తంచేసింది. తన ఇష్టపూర్వకంగానే అజిత్‌ను పెళ్లి చేసుకున్నాడని, అందులో ఎవరి ఒత్తిడి లేదని చెప్పింది. అయితే ఈ విషయాన్ని తండ్రి అర్థం చేసుకోవడంలేదని, అందుకే రోజూ గూండాలను పంపి బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తంచేసింది. దయచేసి మాకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.

దళితుడిని పెళ్లాడినందుకే

దళితుడిని పెళ్లాడినందుకే

సాక్షి మిశ్రా భర్త అజితేశ్ సైతం ఎమ్మెల్యే అనుచరులు తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారన్న భయం వ్యక్తం చేశారు. తాను దళితుడినైనందున వారు చంపేదాక వదలరని అంటున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజేశ్ మిత్రాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కూతురి వీడియో వైరల్ కావడంతో అది పోలీసుల దృష్టికి వెళ్లింది. సాక్షి అభ్యర్థనపై స్పందించిన డీఐజీ కొత్త దంపతులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే వారు ఎక్కడ ఉన్నారో తెలిస్తే భద్రత కల్పించడం సాధ్యమవుతుందని చెప్పారు.

English summary
The daughter of an Uttar Pradesh BJP legislator has alleged that her life is in danger from her father after she married a Dalit man and asked the police for security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X