వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదం: పాక్ జెండాతో బీజేపీ ఎమ్మెల్యే పోస్టర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

భోపాల్: పాకిస్థాన్ జెండాతో బీజేపీ ఎమ్మెల్యే ఉన్న పోస్టర్ ఒకటి మధ్య ప్రదేశ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే రాజధాని భోపాల్ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే విశ్వాస్ సరంగ్ ఫొటోతో ఉన్న ఒక పోస్టర్‌లో ‘పాకిస్థాన్' జెండా కూడా ఉంది.

మిలాద్ నబీ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ పోస్టర్‌ను ఒక కరెంట్ స్తంభంపై ఏర్పాటు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సరంగ్ ఫొటోతో పాటు ఆయన మద్దతుదారులు కూడా ఈ పోస్టర్‌లో ఉన్నారు. అయితే ఈ పోస్టర్‌ను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.

BJP MLA’s picture with Pakistan flag on poster sparks controversy

ఎందుకంటే ఎమ్మెల్యే విశ్వాస్‌ సరంగ్‌ ఫొటోతో ఉన్న ఒక పోస్టర్‌లో పాకిస్థాన్‌ జెండా ఉంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విశ్వాస్ సరంగ్ మాట్లాడుతూ తన పోస్టర్‌ వార్త విని ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.

ఆ పోస్టర్‌తో తనకేమీ సంబంధం లేదన్నారు. కొంతమంది అసాంఘిక శక్తులు కావాలనే ఈ పనిచేశారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనకు కారణం అసాంఘిక శక్తులేనని అన్నారు. ఈ విషయమై భోపాల్ డీజీపీ ఒక లేఖ కూడా రాసినట్లు ఆయన చెప్పారు. అసాంఘిక శక్తులు కొందరు సామాజిక మాధ్యమాల్లో తన పేరిట తప్పుడు సందేశాలను పంపుతున్నారని తన లేఖలో పేర్కొన్నారు.

English summary
A poster in Bhopal carrying a picture of local BJP MLA Vishwas Sarang with the Pakistani flag has sparked a row. The poster came up during Eid Milad-un-Nabi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X