ఓటరు మహాశయా నన్ను క్షమించండి.. జనం ముందు గుంజీలు తీసిన బీజేపీ ఎమ్మెల్యే.. !!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం నేతలు పడుతున్న పాట్లు అన్ని ఇన్నికావు. పదవిలో ఉండగా జనం వైపు చూడని నేతలు.. ఇప్పుడు కాళ్లు అరిగేలా ఓట్ల కోసం వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లు కాళ్లు పట్టుకుని బతిమాలుతున్నారు. గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయం. ఈసారి మళ్లీ గెలిపించండి.. మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ చిత్ర విచిత్ర ఫీటు చేస్తున్నారు.

రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీసిన ఎమ్మెల్యే
తాజాగా యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తల సమావేశంలో గుంజీలు తీశారు. ఓటర్లను క్షమాణలు కోరారు. ఐదేళ్ల పాలనలో తాను చేసిన తప్పులను క్షమించాలని కోరారు. అక్కడితో ఆగని ఆ ఎమ్మెల్యే కుర్చీపైకి ఎక్కి రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

BJP MLA situps and seeks voters for forgiveness

బీజేపీ ఎమ్మెల్యే తీరుపై స్థానికులు ఆగ్ర‌హం
ఈ ఘటన రాబర్ట్ గంజ్‌లో చోటు చేసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే భూపేష్ చౌబే మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే స్థానిక ప్రజలు ఆ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. తమ సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారా ? అని మండిపడుతున్నారు. అయినా బీజేపీ అధిష్టానం మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది. దీంతో కార్య‌క‌ర్త‌ల‌ను శాంతిప‌చేసే ప్ర‌య‌త్నం చేశారు స‌దురు ఎమ్మెల్యే. ఈ ఐదేండ్లలో తాను తప్పు చేస్తే క్షమించాలని కోరుతూ గుంజీలు తీశారు భూపేష్.. దీనికి సంబంధించిన వీడియోను విపక్షాలు సోషల్ మీడియాలో షేర్ చేశాయి. యోగీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+