వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌లో బీజేపీ గూఢచారి: ప్రవీణ్‌ చక్రవర్తిని డిమోట్ చేసిన సోనియా, ఎందుకంటే.?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యారంటూ విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ సన్నిహితుడు, మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ప్రవీణ్ చక్రవర్తికి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ షాకిచ్చారు. రాహుల్ గాంధీకి తప్పుడు సూచనలిచ్చి కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారంటూ 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం పలువురు కాంగ్రెస్ నేతలు ప్రవీణ్‌పై విమర్శలు చేశారు.

రంగంలోకి సోనియా..

రంగంలోకి సోనియా..

ఈ నేపథ్యంలో సోనియా గాంధీ.. ప్రవీణ్‌కు ప్రమోషన్ కల్పించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ డేటా అనలిస్ట్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ఉన్న ప్రవీణ్ చక్రవర్తిని.. ఏఐసీసీ టెక్నాలజీ అండ్ డేటా సెల్ ఛైర్మన్‌గాడిమోషన్ ఇచ్చారు సోనియా గాంధీ. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను ఈ విభాగం పరిశీలిస్తుంది.

నేరుగా అధ్యక్షుడితో కురదదు

నేరుగా అధ్యక్షుడితో కురదదు

డేటా అనలిస్ట్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా నేరుగా పార్టీ అధ్యక్షుడికి రిపోర్టు చేయాల్సి ఉండగా.. ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీకి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కాగా, నియోజకవర్గాల వారీగా సమాచారం, పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో విశ్లేషణ, పార్టీ నేతలు, ప్రతినిధులు, కార్యకర్తలకు మధ్య సమాచారాన్ని పంపిణీ చేయడం లాంటి అంశాలు ఈ టెక్నాలజీ డేటా సెల్ పర్యవేక్షిస్తుంది. అవసరమైన సమాచారాన్ని పార్టీ అధిష్టానానికి అందించేందుకు సిద్ధంగా ఉంటుంది.

రాహుల్‌కు తప్పుడు సలహాలు

రాహుల్‌కు తప్పుడు సలహాలు

కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీకి తప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చి ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యాడని ప్రవీణ్‌పై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రఫేల్ ఫైటర్ జెట్ డీల్‌లో స్కాం జరిగిందంటూ రాహుల్‌కు చెప్పి, అదే విషయాన్ని ఎన్నికల్లో ప్రచారం చేయించారని మండిపడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రఫేల్ ఒప్పందంలో స్కాం జరిగిందంటూ ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ విరుచుకుపడిన విషయం తెలిసిందే. కనీస వేతనాలతో పేదరికం, నిరుద్యోగితను తగ్గించే పథకాలను తీసుకొస్తామని ‘న్యాయ్'ను తీసుకురావడంలో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంతోపాటు చక్రవర్తి కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

కాంగ్రెస్ కార్యాలయంలో బీజేపీ గూఢచారి..

కాంగ్రెస్ కార్యాలయంలో బీజేపీ గూఢచారి..

కాగా, ప్రవీణ్‌ను దూరం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే పలుమార్లు సోనియా గాంధీని కోరారు. ఈ కర్రమంలో సోనియా గాంధీ.. ప్రవీణ్‌కు డిమోషన్ ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్‌షిప్ ప్రాసెస్, అప్రిసియేట్ సిస్టమ్ డెవలప్‌మెంట్ సిస్టమ్స్, ఇతర టెక్నాలజీ నవీకరణలు లాంటి విషయాలను ఇప్పుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో జరగనున్నాయని ఏఐసీసీ వెల్లడించింది. పార్టీ సభ్యుల సెంట్రల్ డేటా, పీసీసీలు, ఏఐసీసీ సభ్యుల వివరాలను కూడా ఈ విభాగం చూసుకుంటుంది. కొత్తగా ఎన్నికైన కమిటీలను సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ గూఢచారి అంటూ ప్రవీణ్‌ను ఆ పార్టీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తుండటం గమనార్హం.

English summary
Congress president Sonia Gandhi has empowered her predecessor and son Rahul Gandhi’s close aide Praveen Chakravarty, a former investment banker who many party leaders believed misled Rahul on vital issues leading to the Congress’ disastrous performance in the 2019 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X