వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హవాలా ద్వారా నగదు పంపిణీ : బీజేపీపై దీదీ సంచలన ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

కోల్ కతా : బీజేపీ నేతలపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్లకు పంచేందుకు హవాలా మార్గంలో బీజేపీ పంపణీ చేస్తోందన్నారు. కానీ దర్యాప్తు సంస్థలు మిన్నకుండిపోయాయని .. ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీ నేతలు జెడ్ ప్లస్ భద్రతతో డబ్బును సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్ లోని అశోక్ నగర్ నియోజకవర్గంలో ఆమె ప్రచారం నిర్వహించారు.

bjp money gave to peopel via hawala : mamatha

వయా హవాలా ..
హవాలా మార్గం ద్వారా భారీగా నగదు చేతులు మారుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం పూర్తయిన తర్వాత రాత్రి బీజేపీ నగదు పంపిణీ కార్యక్రమం చేపడుతోందని ఆరోపించారు. కానీ బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అందుకే టీఎంసీ కార్యకర్తలు గస్తీ కాయాల్సిన అవసరం ఉందన్నారు.

కోట్ల కట్టలు
ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి కోట్లు తీసుకెళ్తూ పట్టుబడ్డాడని గుర్తుచేశారు. అలాగే మోదీ హెలికాప్టర్ ల్యాండ్ చేస్తున్నారని .. మీడియాను అనుమతించడం లేదని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మీడియాపై ఎందుకు ఆంక్షలు అని ఆమె ప్రశ్నించారు. అబద్దాల కోరును ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకోవడం లేదని మమత మండిపడ్డారు. ఈసారి బీజేపీకి భంగపాటు తప్పదని ... ప్రాంతీయ పార్టీలే రాజ్యమేలుతాయని జోస్యం చెప్పారు.

English summary
Mamata Banerjee, the TMC chief of as been sensational. The BJP is sending the way to Hawala to distribute voters. But the investigating agencies have criticized him for not taking any action. BJP leaders in the election blamed Zed Plus for providing security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X