• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తలైవా కు అమిత్ షా బంపరాఫర్: బీజేపీ కూటమితో కలిసి అడగులు : కమల్ తో ఢీ...!

|

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు బీజేపీ అధినాయకత్వం బంపరాఫర్ ఇచ్చింది. బీజేపీ కూటమితో కలవకాలని ఆహ్వానించింది. తమ కూటమితో కలిసి..వచ్చే శాసనసభా ఎన్నికల్లో గెలిస్తే పీఠం ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. 2021 లో జరిగే శాసనసభా ఎన్నికల నాటికి తమ డీఎంకే కు ధీటుగా తమ కూటమిని సిద్దం చేసే పనిలో బీజేపీ జాతీయాధ్యక్షడు అమిత్ షా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కొద్ది కాలంగా రజనీకాంత్ సైతం ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ గురించి సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు.

దీంతో..రజనీని తమ వైపు తిప్పుకోవటం ద్వారా తమిళనాట అధికారం డీఎంకే కు దక్కకుండా చూడాలనేది బీజేపీ లక్ష్యం. ఇందులో భాగంగా..రజనీ కాంత్ నుండి సైతం సానుకూలత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ గా చెప్పకపోయినా...రజనీ చేస్తున్న వ్యాఖ్యల్లో పరమార్ధం అదే అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదే జరిగితే...బీజేపీ పైన సీరియస్ గా స్పందిస్తున్న కమల్ తో రజనీ ఢీ అంటే ఢీ అనక తప్పని పరిస్థితి ఏర్పుడుతుంది.

రజనీకి బీజేపీ మీద పెరుగుతున్న ప్రేమ..!

రజనీకి బీజేపీ మీద పెరుగుతున్న ప్రేమ..!

రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ రంగ ప్రవేశం పైన ప్రకటనలు మినహా..నేరుగా ప్రవేశం చేయటం లేదు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్. గత ఏడాదిలో రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగా ప్రకటించారు. అంతే కాదు అందుకు తన అభిమానులను సన్నద్ధం చేశారు. వారు రజనీ ప్రజా సంఘం పేరుతో సభ్యుల నమోదు, కార్య నిర్వాహకులు,బూత్‌కమీటీలు అంటూ హంగామా చేశారు. దీంతో గ త పార్లమెంట్‌ ఎన్నికల్లో రజనీకాంత్‌ పార్టీ పెట్టి పోటీ చేస్తారని చాలా మంది భావించారు. అలాంటిది శాసన సభ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న రజనీ పార్లమెంట్‌ ఎన్నికలకు దూ రంగా ఉన్నారు. ఇదే సమయంలో రజనీ కాంత్ భారతీయ జనతా పార్టీకు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ముందు నరేంద్రమోది బలవంతుడని అని పేర్కొన్నారు. ఎన్నికలనంతరం ఫలితాలతో పూర్తిగా బీజీపీ మద్దతుదారుడిగా మారినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. 70 రద్దు వంటి కేంద్రప్రభుత్వ చర్యలను సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేసారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో పాటు రజనీ కాంత్‌ సైతం ఒక కార్యక్రమంలో వేదిక పంచుకున్నారు. అందులో మోడీ,అమిత్‌షాలను కృష్ణార్జులుగా పేర్కొంటూ ప్రశంసల వర్షం కురించారు.

అమిత్ షా ఆపర్..రజనీ సమాధానం కోసం..

అమిత్ షా ఆపర్..రజనీ సమాధానం కోసం..

తమ పట్ల రజనీ సానుకూలంగా ఉన్నారని గ్రహించిన బీజేపీ అధినేత అమిత్ షా వేగంగా పావులు కదుపుతున్నారు. రజనీని తమ వైపు తిప్పుకోవానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. దీంతో.. రజనీ సన్నిహితులతో పార్టీ ముఖ్యుల ద్వారా మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో..రానున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజీపీ, అన్నాడీఎంకే పార్టీలో కూటమి పెట్టుకుని పోటీ చేయాలన్నది తలైవా వ్యూహంలా కనిపిస్తోంది. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పాలకప్రభుత్వం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నా ఒక్క లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోలేక పోయింది. దీంతో.. గెలుచుకోలేకపోయ్యింది.దీంతో రానున్న శాసనసభ ఎన్నికల్లోనైనా అన్నాడీఎంకే తో పాటుగా ...రజనీకాంత్‌లతో పొత్తు పెట్టుకుని కూటమిగా విజయ కేతనం ఎగుర వేయాలని భావిస్తోంది. కూటమి గెలిస్తే కీలక సీటు రజనీకి ఇస్తామంటూ ఇప్పటికే బీజేపీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. దీని పైన రజనీ అధికారిక నిర్ణయం కోసం బీజేపీ ఎదురు చూస్తోంది.

ఇక రజనీ వర్సెస్ కమల్ తప్పదా...!!

ఇక రజనీ వర్సెస్ కమల్ తప్పదా...!!

ఇప్పుడున్న సమీకరణాల ఆధారంగా రజనీ కాంత్ బీజేపీతో కలిస్తే తన చిరకాల మిత్రుడు అయిన కమల్ హాసన్ తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఏర్పడుతుంది . కమల హాసన్ తొలి నుండి అన్నాడీఎంకే,బీజీపీ పార్టీలకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కశ్మీర్‌ వ్యవహారంలోనూ బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అయితే రజనీకాంత్‌తో కూటమికి సిద్ధం అనే సంకేతాలు చాలా సార్లు పంపారు. కానీ, రజనీ మాత్రం సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే భవిష్యత్ లో రజనీ వర్సస్ కమల్ గా తమిళ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకొనే ఛాన్స్ ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP moving political steps strategically in Tamilnadu. BJP Chief interesting in alliance with Rajani kanth in coming Assembly elections to face DMK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more