వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు: పెరుగుతున్న ముస్లిం జనాభాతోనే దేశంలో అత్యాచారాలు హత్యలు

|
Google Oneindia TeluguNews

ఉత్తర్ ప్రదేశ్ : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌గా మారుతున్నారు బీజేపీ ప్రజాప్రతినిధులు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఎంపీ హరిఓం పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన జనాభా పెరిగిపోతుండటం వల్లే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని చెప్పారు. అంతేకాదు త్వరలో భారత్‌ నుంచి పాకిస్తాన్‌లా మరో దేశం ఆవిర్భవిస్తుందని పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అంబేద్కర్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పాండే.. ప్రభుత్వం ముస్లిం జనాభా పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. " ఉగ్రవాదం, అత్యాచారాలు, లైంగిక వేధింపులు భారత్‌లోనే జరుగుతున్నాయంటే ఇందకు కారణం పెరుగుతున్న ముస్లిం జనాభానే. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన జనాభాలో మాత్రమే పెరుగుదల కనిపిస్తోంది" అని హరిఓం పాండే అన్నారు. జనాభా పెరుగుదలతో ఉపాధి కల్పించలేని పరిస్థితి ఉత్పన్నమవుతుందన్న ఎంపీ... ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు.

 BJP MP controversial statement:Increase in Muslim population responsible for henious crimes

ముస్లిం జనాభాను నియంత్రించేందుకు త్వరలోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని హరిఓం పాండే అన్నారు. భారత్ మళ్లీ రెండు దేశాలుగా విడిపోకముందే ఈ బిల్లును పార్లమెంటులో పెట్టి చట్టం చేయాలని హరిఓం పాండే సూచించారు.

English summary
Senior Bharatiya Janata Party MP Hari Om Pandey sparked a fresh controversy after stating that the cases of heinous crimes such as rape and murder are rapidly increasing due to the growing Muslim population in India.The BJP MP from Uttar Pradesh's Ambedkar Nagar also asserted that soon a new nation like Pakistan will be carved out from India if the government fails to curb the rising Muslim population in the coming days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X