వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోట్లు విలువ చేసే భూమిని హేమామాలినికి 70 వేలకే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: వందల కోట్లు విలువ చేసే భూమిని బీజేపీ ఎంపీ హేమమాలినికి మహారాష్ట్ర ప్రభుత్వం కారుచౌకగా కట్టబెట్టిన ఉదంతం ఆర్టీఐ ద్వారా వెలుగు చూసింది. ముంబై మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన అంథేరీలో 2000 చదరపు మీటర్ల స్థలం కేవలం రూ. 70 వేలకే హేమమాలినికి ధరాదత్తం చేసింది.

దీనికి సంబంధించిన వివరాలను ఆర్టీఐ కార్యకర్త అనిల్ గాల్గాలీ ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించారు. చదరపు మీటరుకు రూ. 35 చొప్పున ధర నిర్ణయించి ఆమెకు సబర్బన్ కలెక్టర్ స్థలం కేటాయించారని రికార్డులో నమోదైంది.

BJP MP Hema to pay 70,000 for 2,000 sq m plot in Andheri

సాంస్కృతిక ప్రయోజల కోసం హేమమాలిని ట్రస్టుకు ఈ భూమి అప్పగించామని, 1976 నియమాల ప్రకారం ధర నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ ఏర్పాటు కోసమే ఆమెకు ఆ స్థలం కేటాయించినట్టు ఆయన తెలిపారు.

బీజేపీ ఎంపీ అవడం వల్లే హేమమాలినికి మహారాష్ట్ర ప్రభుత్వం అనకూలంగా వ్యవహరించిందని ఆర్టీఐ కార్యకర్త అనిల్ గాల్గాలీ ఆరోపించారు. ఈ విషయమై మహా సీఎం ఫడ్నవీస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా ఆమెకు వెర్సోవా ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించగా ఇప్పటివరకు అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని అందులో పేర్కొన్నారు.

English summary
The price of the 2,000 sq m plot in Andheri, which has been allotted to BJP MP Hema Malini by the state government, has been pegged at Rs 70,000. The records were obtained by activist Anil Galgali under the Right to Information Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X