• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీడియో : లడఖ్‌లో ఆనందోత్సాహాలు.. స్థానికులతో ఎంపీ డ్యాన్స్

|
  లడఖ్‌లో ఆనందోత్సాహాలు.. స్థానికులతో ఎంపీ డ్యాన్స్ (వీడియో)

  లడఖ్ : ఆర్టికల్ 370 రద్దు.. జమ్ముకశ్మీర్ విభజన బిల్లుతో లడఖ్ వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు. లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో స్థానికులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. ఆ క్రమంలో అక్కడి పార్లమెంట్ సభ్యుడు జమ్యాంగ్ సేరింగ్ నామ్‌గ్యల్ ఆదివారం నాడు లడఖ్ చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సరదాగా గడిపారు. అంతేకాదు వారితో కలిసి స్టెప్పులేశారు. ఎంపీ తమతో కలిసి డ్యాన్స్ చేయడంతో లడఖ్ వాసుల ఆనందం అంతా ఇంతా కాదు.

  జమ్యాంగ్ సేరింగ్ నామ్‌గ్యల్ మువ్వన్నెల జెండా చేతబట్టుకుని డప్పుచప్పుళ్ల దరువుకు అనుగుణంగా పాదం కలిపారు. స్థానికులతో కలిసి ఎంపీ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. చిన్నవయసులో ఎంపీగా ఎన్నికైన నామ్‌గ్యల్ చాలా యాక్టివ్‌గా ఉంటూ దేశవ్యాప్త ద‌ృష్టిని ఆకర్షిస్తున్నారు.

  BJP MP Jamyang Namgyal dance to celebrate UT status to Ladakh

  ఆర్టికల్ 370 రద్దు తీర్మానంపై లోక్‌సభలో నామ్‌గ్యల్ అనర్గళంగా మాట్లాడిన తీరు దేశవ్యాప్తంగా అతడిని హీరోను చేసింది. ఈ యువ ఎంపీ మాట్లాడుతున్న వేళ కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది పార్లమెంట్. జమ్ముకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ తెచ్చిన తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో నామ్‌గ్యల్ ప్రసంగంపై ప్రధాని మోడీ సైతం ప్రశంసల జల్లు కురిపించడం విశేషం.

  వామ్మో.. ఇది ఆటోనా.. ఎంతమందిని ఎక్కించావు నాయనా..! (వీడియో)

  దాదాపు 70 సంవత్సరాలుగా లడఖ్ ప్రజలు తమ ప్రాంతానికి కేంద్ర పాలిత హోదా దక్కాలని ఆరాటపడుతున్నారని.. ఇన్నాళ్లకు ఆ కల సాకారం అయిందని.. అదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చలవేనని స్పష్టం చేశారు నమ్‌గ్యాల్. లడఖ్ వెనుకబడటానికి ఆర్టికల్ 370 కారణమని.. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పాపం మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు.

  యువ ఎంపీ జమ్యాంగ్ సేరింగ్ నమ్‌గ్యాల్ ప్రసంగానికి మోడీ ఫిదా అయ్యారు. లడఖ్ ప్రజల ఆకాంక్షలను తన ప్రసంగంలో చక్కగా వివరించిన యువ ఎంపీ నమ్‌గ్యాల్ అభినందనీయులని ట్వీట్ చేశారు. నా యువ స్నేహితుడు జమ్యాంగ్ సేరింగ్ నమ్‌గ్యాల్.. జమ్ముకశ్మీర్‌కు చెందిన కీలక బిల్లుపై చర్చిస్తున్న సమయంలో అద్భుతంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని కొనియాడారు. లడఖ్‌లోని సోదరాసోదరీమణుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఆయన చేసిన ప్రసంగం తప్పకుండా వినాల్సిందేనని కితాబిచ్చారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ladakh MP Jamyang Tseing Namgyal, who shot to fame with his speech in Lok Sabha after Ladakh was made a Union Territory, returned to his home town on Sunday and was greeted with a rousing welcome. The young BJP MP, who became an overnight sensation with his speech, was seen dancing in celebration along with locals in his constituency.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more