• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లడాఖ్‌, కశ్మీర్‌లో పంద్రాగస్ట్ జోష్.. డ్రమ్ము వాయించిన బీజేపీ ఎంపీ, డ్యాన్స్ వేసిన దళపతి (వీడియో)

|

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దవడంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. అసేతు హిమాచలంలో భారత్‌తో కలిసిపోయింది. అయితే ఇన్నాళ్లు భారత్‌లో అంతర్భాగమైన ప్రత్యేక హక్కులు ఉండేవి. ఇప్పుడు అవి రద్దవడంతో .. ఆగస్టు 15న ఇదివరకు ఎగిరిన జెండా స్థానంలో మువ్వన్నెల జెండా ఎగిరింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కశ్మీర్‌లో జరిగిన వేడుకల్లో గవర్నర్ సత్యపాల్ మాలిక, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. అయితే జమ్ముకశ్మీర్, లడాఖ్‌లో నేతలు ఉత్సాహంగా పంద్రాగస్ట్ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

డ్రమ్ము వాయించిన ఎంపీ ..

డ్రమ్ము వాయించిన ఎంపీ ..

లడాఖ్‌లోని లెహ్‌లో స్వాతంత్ర్య దినోవత్స వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదివరకు ఇక్కడ పంద్రాగస్టు వేడుకలే ఉండేవి కావు. కానీ ఇప్పుడు లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో మువ్వన్నెల జెండా రొమ్ము విప్పుకుంటూ ఎగిరింది. ఇక లడాఖ్‌కు చెందిన బీజేపీ ఎంపీ జమ్‌యాంగ్ పాల్గొన్నారు. అక్కడే ఉన్న డ్రమ్ము వాయిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కాసేపు డ్యాన్స్ చేసి .. డ్రమ్ము వాయిస్తూ మిగతావారిని ఉత్సాహపరించారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ .. ఎంపీ డ్రమ్ము వాయించడం మంచి సంకేతం ఇచ్చింది. లడాఖ్‌లో పరిస్థితి సానుకూలంగా ఉందని చెప్పడానికి సజీవ ఉదాహరణగా నిలిచింది. ఎంపీ సాంప్రదాయ డ్రమ్ము వాయించగా .. శ్రేణులు అతనిని మరింత ఎంకరేజ్ చేశారు.

డ్యాన్సులేసిన దళపతి ..

డ్యాన్సులేసిన దళపతి ..

లడాఖ్‌లో పరిస్థితి ఇలా ఉంటే జమ్ముకశ్మీర్‌లో కూడా పంద్రాగస్ట్ వేడుకలు వేడుకగా జరిగాయి. ఊరు, వాడ, గల్లీ వీనువిధుల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా డ్యాన్స్ చేసి తమ శ్రేణులను మరింత ఉత్సాహపరిచారు. మిగతావారు కూడా కాలు కదిపి .. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఇదే అనేలా డ్యాన్సులు వేసి స్వేచ్చ వాయువులు పీల్చారు. మిగతా వారు కూడా రవీందర్‌తో జత కలిసి పంద్రాగస్టు వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికి జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో పంద్రాగస్టు వేడుకలు కన్నులపండుగగా జరిగాయి. బీజేపీ ఎంపీ డ్రమ్ము వాయించగా , బీజేపీ అధ్యక్షుడు డ్యాన్స్ చేయడమే దీనికి సజీవ సాక్ష్యంగా నిలచింది.

పటేల్ యాదిలో

పటేల్ యాదిలో

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆకాంక్షను నెవవేర్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరవేశారు మోడీ. తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్ముకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370, 35 ఏ సెక్షన్లను రద్దు చేసి కశ్మీరీ ప్రజలకు దేశంలో మిగతావారిలాగా సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన 10 వారాల్లోనే కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఉక్కుమనిషి పటేల్ కోరిక కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడమేనని ... దానిని తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. గత పాలకుల స్వార్థ ప్రయోజనాలు, నిర్లక్ష్యం వల్లే కశ్మీర్‌కు ఈ గతి పట్టిందన్నారు. వారు 70 ఏళ్లలో చేయనిది తాము 70 రోజుల్లో చేశామన్నారు. ఇకనుంచి దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే రాజ్యం అమల్లో ఉంటాయని తేల్చిచెప్పారు. పటేల్ కల ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ కలను తమ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP MP from Ladakh, Jamyang Tsering Namgyal plays a traditional drum with locals while celebrating IndependenceDay, in Leh. BJP Jammu & Kashmir President Ravinder Raina dances during IndependenceDay celebrations in JAMMU.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more