వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాతో బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారినపడి మరో భారతీయ జనతా పార్టీ ఎంపీ కన్నుమూశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు నంద్ కుమార్ సింగ్ చౌహాన్(68) మంగళవారం మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన.. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నంద్ కుమార్ సింగ్ మంగళవారం తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నంద్ కుమార్ సింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. ఈయన ఖండ్వా నుంచి లోక్‌సభకు నాలుగు సార్లు ఎన్నికయ్యారు.

BJP MP Nand Kumar Singh Chauhan dies of COVID complications

అంతేగాక, మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. 2009-2014 మధ్య కాలాన్ని మినహాయిస్తే 1996 నుంచి ఇప్పటి వరకు నంద్ కుమార్ ఎంపీగా ఉన్నారు.


ఎంపీ నంద్‌కుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వక్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మధ్యప్రదేశ్ బీజేపీ బలోపేతానికి ఆయన గొప్ప సేవలు అందించారని, పార్లమెంటు కార్యకలాపాల్లోనూ చొరవతో తనదైన ముద్ర వేశారని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేసుకున్నారు. సన్నిహితుడిని కోల్పోయానంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నంద్ కుమార్ సిద్ధాంతాల కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఇతర బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు నంద్ కుమార్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

English summary
The BJP-ruled Madhya Pradesh lost its first sitting parliamentarian due to COVID-19 related complications, as six-time BJP Lok Sabha member and former state party president Nand Kumar Singh Chauhan passed away on Monday late night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X