వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరు స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ హుష్ కాకి, సిద్దరామయ్య ఆశల మీద నీళ్లు: ప్రజల విజయం, బీజేపీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని చాలుక్య సర్కిల్ నుంచి బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిలోని హెబ్బాళ ఎస్టీమ్ మాల్ వరకు స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ పనులకు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం చెక్ పెట్టింది. బెంగళూరులో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు తాము చెయ్యడం లేదని సంకీర్ణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది.

బెంగళూరు ప్రజలు, బెంగళూరు ప్రతిష్టాన సంస్థ, స్వచ్చంద సంస్థలు గత నాలుగు సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నాయి, ఈ పోరాటినికి ఫలితంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.

BJP MP Rajeev Chandrasekhar claims victory over steel bridge project in Bengaluru

Recommended Video

ఎంపీలకు విందు ఇవ్వనున్న ప్రధాని మోదీ

ప్రజలు, పరిసర ప్రాంతాలు కాపాడే సంస్థలు, నిపుణులు వ్యతిరేకిస్తున్న సమయంలోనే 2016లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి సీఎం సిద్దరామయ్య స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ నిర్మాణం పనులకు చేపడుతామని ప్రకటించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టీల్ బ్రిడ్జ్ నిర్మించాలని నిర్ణయించారు.

స్టీల్ బ్రిడ్జ్ పథకాన్ని ప్రజలతో పాటు గ్రీన్ ట్రిబునల్ న్యాయస్థానం వ్యతిరేకించింది. స్టీల్ బ్రిడ్జ్ పనులు చేపట్టమని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ప్రజలు, స్వచ్చంద సంస్థల పోరాటం కారణంగానే స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయని, ఇది ప్రజల విజయం అని రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ అంటున్నారు.

స్టీల్ బ్రిడ్జ్ పనులు చేపడుతామని అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఒంటికాలి మీద నిలబడ్డారు. సిద్దరామయ్య నిర్మించాలని నిర్ణయించిన స్టీల్ బ్రిడ్జ్ పనులు తాము ముందుకు కోనసాగిస్తామని ప్రస్తుత సీఎం హెచ్.డి. కుమారస్వామి స్పష్టం చేశారు. అయితే అనేక కారణాల వలన స్టీల్ బ్రిడ్జ్ పనులు ప్రారంభం కాకముందే నిలిచిపోయాయి.

English summary
Bjp mp Rajeev chandrasekhar claims that because their protest government withdraws the steel bridge project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X