వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నావ్‌లో యూపీ మంత్రులు, ఎంపీకి చుక్కెదురు, పరామర్శించేందుకు వస్తే ఘెరావ్..

|
Google Oneindia TeluguNews

ఉన్నావ్ దాడి ఘటనపై యూపీ అట్టుడుకుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఉన్నావ్‌లో కుటుంబసభ్యులను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎంపీకి స్థానికుల నుంచి నిరసన ఎదురైంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు నినాదాలు చేశారు.

ఉన్నావ్ బాధితురాలి తండ్రిపై దాడి, అంకుల్, పదేళ్ల చిన్నారికి బెదిరింపులు, ప్రియాంకగాంధీఉన్నావ్ బాధితురాలి తండ్రిపై దాడి, అంకుల్, పదేళ్ల చిన్నారికి బెదిరింపులు, ప్రియాంకగాంధీ

ఉన్నావ్ బాధితురాలి కుటుంబసభ్యులను పలుకరించేందుకు యూపీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, కమల్ రాణి వరుణ్‌తో ఎంపీ సాక్షి మహారాజ్ వచ్చారు. వారి వస్తున్న విషయం తెలుసుకొని స్థానికులు రెచ్చిపోయారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టేందుకు యూపీ పోలీసులు ప్రయత్నించారు.

BJP MP Sakshi Maharaj, other leaders heckled in victim village

ఉన్నావ్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్న సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం స్పందించారు. నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులకు శిక్ష విధిస్తామని చెప్పారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్టు ఉన్నావ్ బాధితురాలి నిందితులను కూడా కాల్చి చంపాలని ఆమె తండ్రి కోరారు. మరోవైపు ఉన్నావ్‌ బాధితురాలి కుటుంబసభ్యులను ప్రియాంకగాంధీ పరామర్శించారు.

గతేడాది డిసెంబర్‌లో బాధితురాలిపై లైంగికదాడి చేశారు. తర్వాత కేసు నమోదు చేశారు. ఇటీవల రాయ్ బరేలి కోర్టుకు సాక్ష్యం చెప్పేందుకు వెళ్తుండగా నిలువరించి, దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కిరోసిన్ పోసి నిప్పంటించడంతో 90 శాతం గాయాలతో యువతి ఆస్పత్రిలో చేరింది. లక్నో నుంచి ఢిల్లీ తీసుకొచ్చిన ప్రయోజనం లేకపోయింది.

English summary
U P ministers Swami Prasad Maurya and Kamal Rani Varun, along with BJP MP Sakshi Maharaj, were heckled by protesters village of the Unnao rape victim to meet her family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X