వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓవైసీ తీరు మారలేదు.. మత విద్వేషాలే లక్ష్యం..! అక్బరుద్దీన్‌ను ఏకిపారేసిన బీజేపీ ఎంపీలు..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్. మత రాజకీయాలతో ఓవైసీ బ్రదర్స్ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీతో జతకట్టిన ఎంఐఎం ఎంతకైనా దిగజారుతుందని మండిపడ్డారు. గురువారం పార్లమెంట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారిద్దరు మాట్లాడారు.

కరీంనగర్‌లో నడిచేది బొందుగాళ్ల రాజ్యం కాదని.. హిందుగాళ్ల రాజ్యం నడుస్తోందన్నారు సంజయ్. ముస్లిం మహిళల పట్ల ఎంఐఎం పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోడీ ట్రిపుల్ తలాక్ చట్టబద్దం చేయడానికి క‌ృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. లోపాయికారి ఒప్పందంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీతో జతకట్టి ఎంఐఎం హైదరాబాద్ నగరంలో ఎన్నో అరచకాలకు తెర తీస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమని జోస్యం చెప్పారు.

bjp mps bandi sanjay and dharmapuri arvind fires on akbaruddin owaisi

భార్యాభర్తలకు షాక్.. యాసిడ్ దాడి కేసు.. సంచలన తీర్పు..!భార్యాభర్తలకు షాక్.. యాసిడ్ దాడి కేసు.. సంచలన తీర్పు..!

నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా అక్బరుద్దీన్‌పై విరుచుకుపడ్డారు. కరీంనగర్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీల పేరు చెప్పి అన్నాదమ్ములిద్దరూ (ఓవైసీ బ్రదర్స్) పబ్బం గడుపుకుంటున్నారని ఫైరయ్యారు. మీ వాళ్లే నీపై హత్యాయత్నం చేసి కిడ్నీలు దెబ్బతీసిన విషయం మరిచిపోయావా అంటూ ప్రశ్నించారు. హిందువులను ఏం చేయగలవు.. నీ బొంద చేస్తావంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మత రాజకీయాలకు పాల్పడటం సరికాదని హితవు పలుకుతూనే.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు.

English summary
BJP MP's Bandi Sanjay and Dharmapuri Arvind fires on MIM MLA Akbaruddin Owaisi. They countered to akbaruddin sentences which is made in karimnagar meeting. They also suggested to akbaruddin that dont play religion politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X