వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిశాపై బీజేపీ కన్ను? భువనేశ్వర్‌లో మోడీ రోడ్ షో.. పోటెత్తిన జనం

కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వచ్చే నెలలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అధికార బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం భువనేశ్వర్‌లో ప్రారంభమైంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వచ్చే నెలలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అధికార బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం భువనేశ్వర్‌లో ప్రారంభమైంది.

దటీజ్ యోగి ఆదిత్యనాథ్: అందరు సీఎంలు ఓకవైపు, ఈయన ఒకవైపుదటీజ్ యోగి ఆదిత్యనాథ్: అందరు సీఎంలు ఓకవైపు, ఈయన ఒకవైపు

మౌలికంగా అంత బలంగా లేని రాష్ట్రాల్లో దృష్టి పెట్టాలని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ఒడిశా వేదికగా ఈ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతోపాటు కీలక నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు.

రోడ్ షో తో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం...

రోడ్ షో తో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం...

జాతీయ కార్యవర్గ సదస్సుకు ముందు ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించి.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో దిగిన అనంతరం ఆయన రోడ్ షో నిర్వహిస్తూ కార్యవర్గ సమావేశాల ప్రాంగణానికి చేరుకున్నారు.

మోడీకి ఘన స్వాగతం...

మోడీకి ఘన స్వాగతం...

బీజేపీ రాష్ట్ర నేతలు మోడీకి ఘన స్వాగతం పలికారు. రోడ్డుకిరువైపులా భారీ ఎత్తున జనం నిలబడి ఆయనకు స్వాగతం పలుకుతూ అభివాదం చెప్పారు. ప్రధానిని చూసేందుకు పలువురు ఉత్సాహం చూపారు.

తూర్పు భారతంలో పట్టుకోసం..

తూర్పు భారతంలో పట్టుకోసం..

కీలకమైన ఈ భేటీలో ప్రధాని మోడీ, అమిత్ షా సహా 40 మంది కేంద్రమంత్రులు, 13 మంది ముఖ్యమంత్రులు, పార్టీ ప్రధాన నేతలు పాల్గొనబోతున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్, ఒడిశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అంతేకాదు తూర్పు భారతంలో పట్టు చాటుకోవాలని ఈ పార్టీ నేతలు తపిస్తున్నారు.

ఒడిశా నుంచే మొదలు...

ఒడిశా నుంచే మొదలు...

అందుకు ఒడిశాను వేదికగా చేసుకోవాలన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తున్నది. ఇక్కడ బీజేపీ బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అంచనాలకు భిన్నంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది.

అందుకే భువనేశ్వర్ లో భేటీ...

అందుకే భువనేశ్వర్ లో భేటీ...

అధికార బీజేడీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలకు షాకిచ్చే రీతిలో ఇక్కడ ఫలితాలు సాధించింది. ఈ నేపథ్యంలో ఒడిశాలోనూ పాగా వేయాలని కమలనాథులు భావిస్తున్నారు. అందులో భాగంగానే భువనేశ్వర్‌లో కీలకమైన జాతీయ కార్యవర్గ భేటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఈ భేటీకి విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ దూరంగా ఉండే అవకాశముందని తెలుస్తోంది.

English summary
The BJP's two-day national executive meeting is currently underway at Bhubaneswar. About 350 people, which includes Prime Minister Narendra Modi, party chief Amit Shah, union ministers, Chief Ministers of 13 BJP-ruled states including UP CM Yogi Adityanath, are attending the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X