బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైసూరు యువరాజును కలిసిన అమిత్ షా, రాజకీయ వేడి, బీజేపీలోకి యువరాజు ?

|
Google Oneindia TeluguNews

మైసూరు: రెండు రోజుల పాటు మైసూరులో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం మైసూరు ప్యాలెస్ లో మైసూరు మహారాజ వంశస్తులతో భేటీ అయ్యారు. రాజమాత ప్రమోదాదేవి బడయార్, మైసూరు మహారాజు యదువీర్ ఒడయార్ తో అమిత్ షా చర్చలు జరిపారు.

 బుల్లి యువరాజుతో అమిత్ షా

బుల్లి యువరాజుతో అమిత్ షా

మైసూరు ప్యాలెస్ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యురాజు యదువీర్ ఒడయార్ కుమారుడిని చూసి మురిసిపోయారు. యువరాజు యదువీర్ ఒడయార్ చేతుల్తో ఉన్న బుల్లి యువరాజు చెయ్యి పట్టుకుని అమిత్ షా చిరునవ్వుతో పలకరించారు.

ప్యాలెస్ లో రాజకీయ వేడి

ప్యాలెస్ లో రాజకీయ వేడి

మైసూరు ప్యాలెస్ కు అమిత్ షాతో పాటు బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంత్ కుమార్, మైసూరు, కొడుగు లోక్ సభ సభ్యుడు ప్రతాప్ సింహాతో పాటు 10 మంది బీజేపీ సీనియర్ నాయకులు వెళ్లడంతో అక్కడ రాజకీయ వాతారణ వేడేక్కింది.

బీజేపీలోకి యువరాజు !

బీజేపీలోకి యువరాజు !

మైసూరు యవరాజు యదువీర్ ఒడయార్ బీజేపీలో చేరుతారని చాల కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల ఈ విషయంపై స్పంధించిన యువరాజు యదువీర్ ఒడయార్ తనకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదని, ఈ విషయంలో తనను ఎవ్వరూ సంప్రధించలేదని మీడియాకు చెప్పారు.

స్వయంగా అమిత్ షా

స్వయంగా అమిత్ షా

మైసూరు యువరాజు బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా మైసూరు ప్యాలెస్ చేరుకుని రాజ కుటుంబంతో చర్చలు జరపడంతో ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంపై మైసూరు యువరాజు కాని, బీజేపీ నాయకులు కాని ఎలాంటి క్లూ ఇవ్వలేదు.

English summary
BJP National president Amit Shah, who is in two days tour to Mysuru as a part of his campaign for Karnataka assembly elections 2018, meets Mysuru King Yaduveer Urs on March 30th. Amit shah's new step creates curiousity in state politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X