వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ -హోమ్ ఐసోలేషన్‌‌లో కీలక నేతలు - బెంగాల్ పర్యటనలో?

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా కేసులు తగ్గముఖం పట్టినా.. ఇప్పటికీ పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వైరస్ బారినపడుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా పరీక్ష అనంతరం రిపోర్టులో పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు.

కేసీఆర్‌‌కు మరో షాక్: 'వెలమ' అస్త్రం -బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు -సొంతకులంలో కలకలంకేసీఆర్‌‌కు మరో షాక్: 'వెలమ' అస్త్రం -బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు -సొంతకులంలో కలకలం

Recommended Video

#Breaking #JPNaddaCorona బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకి కరోనా పాజిటివ్

''ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నా. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కోవిడ్ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నా. ఇటీవల నన్ను కలిసి వారంతా హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండండి. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి'' అని నడ్డా ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశారు.

 BJP national president JP Nadda Tests Positive For Coronavirus

జాతీయ అధ్యక్షుడు నడ్డాకు కరోనా సోకడంతో ఆయన తొందరగా కోలుకోవాలని పలు రాష్ట్రాల బీజేపీ శాఖలు, కీలక నేతలు ప్రకటనలు చేశారు. ఇటీవల వెస్ట్ బెంగాల్ పర్యటనలోనే జేపీ నడ్డాకు కరోనా సోకి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బెంగాల్ లో పాగా కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.

షాకింగ్: బీజేపీతో టీఆర్ఎస్ సంధి? -హైదరాబాద్‌కు కేసీఆర్‌, ఢిల్లీకి బండి సంజయ్‌ -ఏం జరుగుతోంది?షాకింగ్: బీజేపీతో టీఆర్ఎస్ సంధి? -హైదరాబాద్‌కు కేసీఆర్‌, ఢిల్లీకి బండి సంజయ్‌ -ఏం జరుగుతోంది?

నడ్డా బెంగాల్ పర్యటన సందర్భంగా టీఎంసీ కార్యకర్తలుగా అనుమానిస్తోన్న వ్యక్తులు.. ఆయన కాన్వాయ్ పై రాళ్ల దాడికి పాల్పడటం, పలువురు బీజేపీ నేతలు గాయపడిన ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. దాడి నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదిరాయి. బెంగాల్ లో పని చేస్తున్న అధికారులను డిప్యూటేషన్ పై కేంద్రంలోకి రప్పిస్తూ హోం మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది.

పశ్చిమబెంగాల్ కేడర్లో విధులు నిర్వహిస్తున్న డైమండ్ హార్బర్ ఎస్పీ భోల్‌నాథ్ పాండే , ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీ ప్ర‌వీణ్ త్రిపాఠ‌, దక్షిణ బెంగాల్ అద‌న‌పు డీజీ రాజీవ్ మిశ్రాల‌ను కేంద్రంలో ప‌ని చేయాల‌ని ఆదేశించింది. న‌డ్డా ప‌ర్య‌ట‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైనందున ఈ స‌మ‌న్లు జారీ చేస్తున్న‌ట్లు కేంద్రం హోంశాఖ తెలిపింది. నడ్డా కాన్వాయ్ పై దాడి ఘటనకు సంబంధించి మూడు ఎఫ్ఐఆర్‌లు న‌మోదుకాగా, పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.

English summary
BJP chief JP Nadda announced today that he has tested positive for the novel coronavirus and has isolated himself at home. Mr Nadda shared the news on his Twitter account today. Mr Nadda, 60, said that he got the test done after he experienced some initial symptoms and added that his health is fine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X