వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏ నుంచి మరో పార్టీ ఔట్? - బీజేపీ ద్రోహం చేసిందన్న ఎన్‌పీపీ - మణిపూర్‌లో మళ్లీ హైడ్రామా

|
Google Oneindia TeluguNews

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో నెలన్నర తర్వాత మళ్లీ పొలిటికల్ హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తలపెట్టిన కేబినెట్ ప్రక్షాళన.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) కూటమిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎన్‌పీపీకి చెందిన ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తొలగించడంతో ఇప్పుడా పార్టీ ఎన్డీఏ నుంచి తప్పుకునే దిశగా అడుగులు వేస్తున్నది. వ్యవసాయ బిల్లులపై కేంద్రంతో విభేదించిన శిరోమణి అకాళీదళ్ ఆదివారం ఎన్డీఏ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్, కంగనకు భారీ షాక్ - బీజేపీ, శివసేన రహస్య భేటీ - అమిత్ షా చెంతకు -అసలేమైందంటేకాంగ్రెస్, కంగనకు భారీ షాక్ - బీజేపీ, శివసేన రహస్య భేటీ - అమిత్ షా చెంతకు -అసలేమైందంటే

బీజేపీ నమ్మక ద్రోహం..

బీజేపీ నమ్మక ద్రోహం..

మొత్తం 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 18 మంది ఎమ్మెల్యేలుండగా, ఎన్‌పీపీ(4), ఎన్‌పీఎఫ్(4), ఎల్జేపీ(1), ఇండిపెండెంట్లు(2) మద్దతుతో ఎన్డీఏ సర్కారును ఏర్పాటు చేయడం తెలసిందే. అయితే, సీఎం బీరేన్ సింగ్ ఏకపక్ష పోకడలను నిరసిస్తూ, ఆగస్టులో ఎన్‌పీపీ తన మద్దతును వెనక్కి తీసుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించారు. అయితే, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి జాతీయ నేతలు రంగంలోకి దిగి బుజ్జగించడంతో ఎన్‌పీపీ తిరిగి సీఎం బీరేన్ కు మద్దతు పలికింది. కానీ తాజా కేబినెట్ ప్రక్షాళలో ఫిరాయింపుదారులకు చోటు కల్పిస్తూ, ఎన్‌పీపీకి చెందిన ఇద్దరు మంత్రుల్ని తొలగించడం మళ్లీ రచ్చకు దారి తీసింది. బీజేపీ నమ్మకద్రోహానికి పాల్పడిందని ఎన్‌పీపీ నేతలు బాహాటంగా విమర్శించారు.

ఎన్డీఏకు రాంరాంపై సంగ్మా కీలక భేటీ

ఎన్డీఏకు రాంరాంపై సంగ్మా కీలక భేటీ

మణిపూర్ ప్రభుత్వంలో ఎన్‌పీపీ తరఫున మొన్నటిదాకా నలుగురు మంత్రులు ఉండేవాళ్లు. తాజా కేబినెట్ ప్రక్షాళనలో డిప్యూటీ సీఎం జోయ్ కుమార్ సింగ్, మంత్రి లెట్పావ్ హౌకిప్ మినహా జయేంత కుమార్, ఎన్.కయీసీలు పదవులు కోల్పోయారు. ‘‘ఇది అన్యాయం. అమిత్ షా మాకు(ఎన్‌పీపీకి) ఇచ్చిన కమిట్మెంట్ కు విరుద్ధం. దీన్ని మేం నమ్మకద్రోహంగానే భావిస్తున్నాం. ఎన్డీఏ నుంచి వైదొలగాలనుకుంటున్నాం''అని ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్‌పీపీ చీఫ్, మేఘాలయ ముఖ్యమంత్రి కూడా అయిన కాన్‌రాడ్ సంగ్మా.. గువాహటిలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మణిపూర్ నేతలు శనివారం రాత్రి సంగ్మాతో భేటీ అయ్యారు. ఆదివారం రాత్రిలోగా మరోసారి సమావేశమై, ఎన్డీఏ నుంచి వైదొలిగే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఎన్‌పీపీ నేతలు చెప్పారు.

కేంద్ర కేబినెట్ విస్తరణ - మంత్రుల శాఖల్లో మార్పులు - తెలుగు నేతలకు పదవులు?కేంద్ర కేబినెట్ విస్తరణ - మంత్రుల శాఖల్లో మార్పులు - తెలుగు నేతలకు పదవులు?

Recommended Video

రానున్న 24 గంట‌ల్లో ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల || IMD Warns Of Heavy Rainfall In Several States
అమిత్ షా చెప్పినా ఎందుకిలా?

అమిత్ షా చెప్పినా ఎందుకిలా?

ఎన్‌పీపీ అన్ని డిమాండ్లను నెరవేస్తున్నామని, ప్రభుత్వానికి మద్దతు కొనసాగించాలని అమిత్ షా తమకు ఆగస్టులో హామీ ఇచ్చారని, అందుకే నాటి బలపరీక్షలో సీఎం బీరేన్ సింగ్ ను బలపర్చామని, తీరా నెలరోజుల తర్వాత మమ్మల్ని మంత్రి పదవుల నుంచి తొలగించడం ద్వారా బీజేపీ విశ్వాసఘాతుకానికి పాల్పడిందని ఎన్‌పీపీ నేతలు మండిపడుతున్నారు. ఇద్దరు ఎన్‌పీపీ మంత్రులతోపాటు ఓ ఎల్జేపీ మంత్రిని సైతం తొలగించిన సీఎం బీరేన్... కొత్తగా కేబినెట్ లోకి ఐదుగురిని చేర్చుకున్నారు. అందులో ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఫిరాయించినవాళ్లే కావడం గమనార్హం. అమిత్ షా చెప్పిన తర్వాత కూడా సీఎం బీరేన్ సింగ్ ఎన్డీఏ మిత్రులను పదవుల నుంచి తొగించడంలో మతలబు ఏమై ఉంటుదోననే చర్చ జరుగుతోందగి. గడిచిన రెండు నెలల్లో బీజేపీ, కాంగ్రెస్ లోకి పరస్పరం ఫిరాయింపులు జరగడంతో మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు పదవులు కోల్పోయారు.

English summary
The National People’s Party (NPP) viewed the axing of two of its four ministers in Manipur as “betrayal” by ally BJP. The four NPP legislators, who are camping in Guwahati, held a meeting with party’s national president and Meghalaya Chief Minister Conrad Sangma on Saturday evening. They will hold another round of meeting on Sunday evening and decide the fate of the NPP’s alliance with the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X