వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15 కోట్లు, పదవీ ఆఫర్: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యత్నం, అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్ తర్వాత బీజేపీ రాజస్తాన్‌పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో.. సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్ల వరకు ఆఫర్ చేశారని తెలిపారు.

మంచి చేస్తే..

మంచి చేస్తే..

కరోనా వైరస్ వ్యాపిస్తోన్న క్రమంలో ప్రజలకు మంచి పాలన అందించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని గెహ్లాట్ తెలిపారు. కానీ విపక్ష బీజేపీ మాత్రం రాష్ట్రంలో రాజకీయంగా అలజడి సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతుందని మండిపడ్డారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ మాదిరిగా ఇక్కడ కూడా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అందుకోసం ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరవేసి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు.

నగదు..

నగదు..

కొందరికీ డబ్బులు ఇస్తామని, మరికొందరికీ పదవులు, ఇతర సాయం చేస్తామని మాటిస్తున్నారని గెహ్లట్ తెలిపారు. 2014లో విజయం సాధించిన తర్వాత బీజేపీ నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. గోవా, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రవర్తించిందో చూడాలన్నారు. అంతేకాదు గుజరాత్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని గెహ్లట్ తెలిపారు.

Recommended Video

Locusts Swarms To Enter Telangana || జూన్ 20-జులై 5 వరకు మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చే ప్రమాదం !!
బేరసారాలు..?

బేరసారాలు..?


బీజేపీ చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని గెహ్లట్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఏసీబీ పేరుతో కాంగ్రెస్ నేతలను బీజేపీ భయభ్రాంతులకు గురిచేస్తోందని చీఫ్ విప్ మహేశ్ తెలిపారు. అయితే కుషల్ ఘడ్‌ ఎమ్మెల్యేతో బీజేపీ సంప్రదింపులు జరిపిందని ఆరోపణలు గుప్పుమన్నాయి. కానీ అలిగేషన్స్‌ను ఆయన కొట్టిపారేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి జోషి, డిప్యూటీ చీఫ్ విప్ మహేంద్ర చౌదరి ఆరోపణలను ఖండించారు.

 సీఎం, డిప్యూటీ సీఎంకు నోటీసులు

సీఎం, డిప్యూటీ సీఎంకు నోటీసులు

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రయత్నం బీజేపీ చేస్తుందని సీఎం గెహ్లట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు చీప్ విప్ మహేశ్ జోషికి నోటీసులు జారీచేశారు. ప్రభుత్వాన్ని పడగొడతారని కామెంట్ చేయడంపై నోటీసులు ఇచ్చారు. సాక్షాత్ సీఎం, డిప్యూటీ సీఎంలకు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

English summary
Rajasthan Chief Minister Ashok Gehlot hit out at the BJP Saturday afternoon, accusing the party of playing pol
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X