వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Digvijaya singh: ప్రభుత్వం కూల్చేందుకు బీజేపీ కుట్ర..? ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు..?

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్ బీజేపీపై మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు ఇస్తామని ఆఫర్ చేస్తోందని తెలిపారు. దిగ్విజయ్ కామెంట్లను ప్రతిపక్ష బీజేపీ తోసిపుచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆధారాలు ఉంటే బహిరంగ పరచాలని డిమాండ్ చేసింది.

బీజేపీ కుట్ర..?

బీజేపీ కుట్ర..?


గత 15 ఏళ్లు మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ముఖ్యమంత్రి పీఠంపై యావ తగ్గలేదన్నారు. అందుకే తన సహచరుడు నతోత్తం మిశ్రాతో కలిపి కుట్రకు తెరలేపారని దిజ్విజయ్ సింగ్ ఆరోపించారు. అంతేకాదు తొలుత రూ.5 కోట్లు అందజేస్తారని.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత మరో ఇన్‌స్టాల్‌మెంట్ ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు. ఇక చివరి దశ చెల్లింపు ప్రభుత్వం పడిపోయిన తర్వాత అందజేస్తారని తెలిపారు.

అసెంబ్లీ సెషన్‌కు ముందు..?

అసెంబ్లీ సెషన్‌కు ముందు..?

కర్ణాటక ఎమ్మెల్యేల మాదిరిగా మధ్యప్రదేశ్‌లో ఉండబోదని దిగ్విజయ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టంచేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ఆరోపణలు కలకలం రేపుతోన్నాయి. దిగ్వి రాజా కామెంట్లపై ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ్ స్పందించారు. తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలో టచ్‌లో లేరని పేర్కొన్నారు. లేని పోని ఆరోపణలు చేయొద్దని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.

గతంలో కూడా..

గతంలో కూడా..

మరోవైపు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ సమాయత్తమవుతోంది. తమ పార్టీ నేతలందరితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ మాట్లాడారు. కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. దిగ్విజయ్ సింగ్ మాటల మర్మాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరని.. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆయన కామెంట్లు చేశారని పేర్కొన్నారు.

English summary
Former Madhya Pradesh Chief Minister Digvijaya Singh on Monday accused the Bharatiya Janata Party of trying to poach MLAs at Rs 25-35 crore and bring down the Congress government in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X