వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్‌లో ప్రలోభాలు షురూ..? 50-60 కోట్లు, మంత్రిపదవి ఆఫర్.. బీజేపీపై బీఎస్పీ ఎమ్మెల్యే ఆరోపణ

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు తాయిలాలు ప్రకటిస్తుందని మధ్యప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలోనే బీజేపీకి మద్దతు పలికే ఎమ్మెల్యేలకు 50 నుండి 60 కోట్ల రుపాయాలతోపాటు మంత్రి పదవి ఇస్తానని ఫోన్ చేశారని ఆమే చెప్పారు. ఇలా చాల మందికి ఫోన్ చేస్తున్నారని ఆమే తెలిపారు. అయితే బీజేపీ ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు రాంబాయి ప్రకటించారు.. కాగా ఫూల్స్ మాత్రమే బీజేపీ ప్రభావానికి గురవుతారని ఆమే స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు బీజేపీ యత్నాలు

కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు బీజేపీ యత్నాలు

మొత్తం మీద మధ్యప్రదేశ్‌లో రాష్ట్ర్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కేంద్రంలో బీజేపీ భారీ మెజారీటీ సాధించింన తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్ర్రంలో సైతం ప్రభుత్వ మార్పిడికి బీజేపీ సిద్దమైంది. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి కమలానాథ్ ప్రభుత్వానికి మైనారీటీలో పడిందని మధ్య బీజేపీ శాఖ నాయకుడు ప్రతిపక్ష నేత గవర్నర్‌ అనందిబేన్ పటేల్‌కు లేఖ రాశారు.

 బీఎస్సీ మద్దతుతో కొనసాగుతున్న కమలనాథ్

బీఎస్సీ మద్దతుతో కొనసాగుతున్న కమలనాథ్

కాగా గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి ఎస్సీ,బీఎస్పీ పార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా అధికారాన్నిచేజిక్కించుకుంది.కాగా గత ఎన్నికల్లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 114 బీజేపీకి 109 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులతోపాటు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒకరు ఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థుల సపోర్టుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

 బల నిరూపణకు సిద్దమని ప్రకటించిన కమలనాథ్..

బల నిరూపణకు సిద్దమని ప్రకటించిన కమలనాథ్..


కాగా కమలనాథ్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన రోజు నుండే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ,ఇలా ఇప్పటికే అయిదు నెలల కాలంలో నాలుగు సార్లు ప్రభుత్వ మెజారిటీ నిరూపించుకున్నానని ఇప్పుడు మరోసారి ప్రభుత్వ మెజారీటీ నిరూపించుకునేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలనే తలంపుతోనే ఇదంతా చేస్తుందని ఆయన విమర్శలు చేశారు.

English summary
Ramabai, BSP MLA said that The bjp are making offers to everyone, only fools will come under their influence. I get phone calls offering both Minister berth & money but I have denied the offers. They are offering Rs 50-60 crore to a number of people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X