బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ అభ్యర్థుల జాబితా, బెంగళూరులో వీరే, బళ్లారిలో తేలని లెక్కలు, శ్రీరాములు, గాలి!

|
Google Oneindia TeluguNews

Recommended Video

బళ్లారి లో మినహా అన్ని చోట్ల అభ్యర్దుల జాబితా సిద్దం

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఒక అడుగు ముందుకువేసింది. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్దం చేసిన బీజేపీ అధిష్టానం మొదటి జాబితాను విడుదల చేసింది. శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయిన అభ్యర్థులు ఇప్పుడు ప్రచారం ముమ్మరం చేశారు. బెంగళూరులోని కొన్ని నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి ప్రభావంతో లెక్కలు తేల్చలేకపోతోంది.

జేడీఎస్ దూకుడు

జేడీఎస్ దూకుడు

కర్ణాటక శాసన సభ ఎన్నికలు మే 12వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జేడీఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే జేడీఎస్ 126 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి ప్రచారం ముమ్మరం చేసింది. కర్ణాటకలో 224 శాసన సభ స్థానాలలో జేడీఎస్ 20 సీట్లను బీఎస్పీకి కేటాయించింది.

కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తరువాత తమ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా వ్యవహరిస్తోంది. బీజేపీ, జేడీఎస్ అభ్యర్థులను ఎదుర్కొనే సత్తా ఉన్న అభ్యర్థులను ఎంపిక చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

బీజేపీ మూడు రౌండ్లు

బీజేపీ మూడు రౌండ్లు

బీజేపీ మూడు సార్లు అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు చేసి చివరికి న్యూఢిల్లీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్దం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసింది.

న్యూఢిల్లీలో విడుదల

న్యూఢిల్లీలో విడుదల

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కమిటీ అభ్యర్థులను ఎంపిక చెయ్యడంతో న్యూఢిల్లీలో బీజేపీ సీనియర్ నాయకుడు జేపీ. నడ్డా మొదటి జాబితాను విడుదల చేశారు. ఉత్తర కర్ణాటకతో పాటు దక్షిణ కర్ణాటకలో 72 శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జేపీ. నడ్డా విడుదల చేశారు.

బెంగళూరులో ప్రముఖలు

బెంగళూరులో ప్రముఖలు

బెంగళూరులోని యలహంకలో- ఎస్ఆర్. విశ్వనాథ్, రాజరాజేశ్వరీ నగర- పీఎం. మునిరాజు గౌడ, దాసరహళ్ళి- ఎస్ మునిరాజు, మల్లేశ్వరం- డాక్టర్ సీఎస్, అశ్వథ్ నారాయణ, హెబ్బాళ- డాక్టర్ వైఏ, నారాయణస్వామి, సీవీ రామన్ నగర- ఎస్. రఘ, రాజాజీనగర- సురేష్ కుమార్, గోవిందరాజనగర- వీ. సోమణ్ణ, చిక్కపేట-ఉదయ గరుడాచార్, బసవణగుడి- రవి సుబ్రమణ్య, పద్మనాభనగర- ఆర్. అశోక్, జయనగర- బీఎన్. విజయ్ కుమార్, మహదేవపుర- అరవింద లింబావలి, బోమ్మనహళ్ళి- సతీష్ రెడ్డి, బెంగళూరు దక్షిణ ఎం. కృష్ణప్ప, ఆనేకల్- ఏ. నారాయణస్వామిని బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. మిగిలిన నియోజక వర్గాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించలేదు.

బళ్లారిలో తేలని లెక్కలు !

బళ్లారిలో తేలని లెక్కలు !

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి ఎంతో పలుకుబడి ఉన్న బళ్లారి జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. కంప్లీలో టీహెచ్. సురేష్ బాబు, విజయనగరలో గవియప్ప, మోళకాల్మూరులో బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు, చిత్రదుర్గలో జీహెచ్. తిప్పారెడ్డి, సండూరులో బి. రాఘవేంద్రను అభ్యర్థులుగా ప్రకటించారు, బళ్లారిలో మాత్రం బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు.

English summary
Bharatiya Janata Party (BJP) announced official list of 72 candidates for Karnataka assembly elections 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X