వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. కార్యకర్తలను కలవనున్న మోడీ..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్‌లో సాయంత్రం 5.30 గంటలకు సభ్యులు సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్రమోడీ మీటింగ్‌కు హాజరుకానున్నారు. ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన నేపథ్యంలో బీజేపీ తదుపరి కార్యచరణపై నాయకులు చర్చించనున్నారు. ప్రమాణస్వీకార తేదీ, కేబినెట్ మంత్రుల పేర్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ హెడ్ క్వార్టర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమవనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 20వేల మంది కార్యకర్తలు హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్పాయి. గ్రాండ్ విక్టరీ అనంతరం పార్టీ హెడ్ క్వార్టర్స్‌కు రానున్న మోడీకి ఘన స్వాగతం పలికేందుకు నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

నాలుగు దశాబ్దాల రికార్డు బ్రేక్..! సంపూర్ణ మెజార్టీతో రెండోసారి అధికారం చేపట్టనున్న ప్రధానిగా మోడీ..నాలుగు దశాబ్దాల రికార్డు బ్రేక్..! సంపూర్ణ మెజార్టీతో రెండోసారి అధికారం చేపట్టనున్న ప్రధానిగా మోడీ..

BJP Parliamentary Board Meeting today

బీజేపీ తరఫున ఎన్నికైన కొత్త ఎంపీలు ఢిల్లీకి రావాలని బీజేపీ కబురు పంపింది. ఈ నెల 25న వారంతా పార్టీ హెడ్ క్వార్టర్‌కు రావాలని సూచించింది. 542 స్థానాలకు జరిగిన సార్వత్రిక సమరంలో బీజేపీ దాని మిత్రపక్షాలు కలుపుకుని 340కిపైగా సీట్లు సాధించాయి. కేంద్రంలో అధికారం చేపట్టేందుకు 272మంది ఎంపీలు అవసరం కాగా.. అంతకు మించి స్థానాలను బీజేపీ సొంతంగా సంపాదించుకుంది.

English summary
Prime Minister Narendra Modi is likely to be at the BJP headquarters today, at 5:30 pm for the BJP Parliamentary Board meeting. The PM is scheduled to meet BJP workers today evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X